Friday, March 29, 2024
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..!

- Advertisement -

ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ‘ఖైదీ’ చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిన చిరు.. ఆ తరువాత సుప్రీమ్ హీరో బిరుదుని సంపాధించుకున్నారు. తర్వాత మెగాస్టార్ గా ఎదిగారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు,ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఉన్న ఇంకా నెంబర్ వన్ గా చిరు కొనసాగుతున్నారు. ఇంఅ స్టార్ డం అంత ఈజీగా రాదు. ఇప్పటి వరకూ చిరంజీవి సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేస్తుండేవట. సరే చిరంజీవి కెరీర్లో అత్యథిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమాలు ఏంటో చూద్దాం.

సైరా నరసింహారెడ్డి : ఈ చిత్రానికి 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 140 కోట్ల షేర్ ను మాత్రమే నమోదు చేసింది. అయితే మెగాస్టార్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన సినిమా ఇదే.

ఖైదీ నెంబర్ 150 : చిరు తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రానికి 92 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 104 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇంద్ర : మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘ఇంద్ర’ చిత్రానికి 13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 27 కోట్ల షేర్ ను రాబట్టింది.

శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ : ఈ చిత్రానికి 14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 26 కోట్ల షేర్ ను రాబట్టింది.

స్టాలిన్ : ఈ చిత్రానికి 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా కేవలం 23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

శంకర్ దాదా జిందాబాద్ : ఈ చిత్రానికి కూడా 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా.. కేవలం 18 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

ఠాగూర్ : ఈ చిత్రానికి 14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 24 కోట్ల షేర్ ను రాబట్టింది.

జై చిరంజీవ : ఈ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా కేవలం 12కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

అన్నయ్య : ఈ చిత్రానికి 10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 13 కోట్ల షేర్ ను రాబట్టింది.

అంజి : ఈ చిత్రానికి 24 కోట్ల బిజినెస్ జరుగగా కేవలం 12 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

Also Read: టాలీవుడ్ లో సూపర్ హిట్ జోడీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -