Friday, May 3, 2024
- Advertisement -

బాలయ్య మరో సైంటిఫిక్ ప్రయోగం.. నిజమేనా ?

- Advertisement -

నట సింహా నందమూరి బాలకృష్ణ కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉండుందో ఆ మద్య రిలీజ్ అయిన ” అఖండ ” మరోసారి నిరూపించింది. ఇక ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలలో ఒక్క బాలయ్య మాత్రమే ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ముఖ్యంగా ” ఆన్ స్టాపబుల్ ” టాక్ షో తో ఇప్పటి జనరేషన్ కు కూడా చాలా దగ్గరయ్యారు బాలయ్య. ఈ షోలో ఎలాంటి కల్మషం లేకుండా తనదైన టైమింగ్ తో పంచులు వేస్తూ అందరినీ అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు నాటసింహ బాలకృష్ణ. దాంతో ఆయన తరువాతి సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. .

ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ” వీరసింహ రెడ్డి ” మూవీ చేస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీపై ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు బాలయ్య.. ఈ మూవీతో ఆయనలోని కామిడీ టైమింగ్ ను మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. ఈ విషయం అలా ఉంచేతే బాలయ్య మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేరాఫ్ కంచరపాలెం మూవీతో మంచి ప్రశంశలు అందుకున్న వెంకటేష్ మహా తో బాలయ్య మూవీకి కమిటైనట్లు వార్తలు వస్తున్నాయి.

వెంకటేష్ మహా చెప్పిన స్టోరీ లైన్ బాలయ్య కు నచ్చడంతో మూవీకి ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ప్రయోగాలు చేసేందుకు బాలకృష్ణ ఎప్పుడు ముందే ఉంటారు. కెరియర్ మొదటి నుంచి కూడా ఎన్నో ప్రయోగాలు చేసిన బాలయ్య ” బైరవద్వీపం ” ,” ఆదిత్య 369 ” వంటి ప్రయోగాత్మక చిత్రాలతో అద్భుత విజయాలను అందుకున్నారు. దాంతో మరోసారి ప్రయోగం చేసేందుకు బాలకృష్ణ సిద్దమయ్యారట. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి.. ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఈ రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

చిరు కోసం స్టార్ హీరోలు ?

బాద్ షా రీ-రిలీజ్.. బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందా ?

పవన్ పక్కకి.. విజయ్ లైన్ లోకి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -