Friday, May 17, 2024
- Advertisement -

చిరంజీవి కంటే బాలకృష్ణే ఫాస్ట్ ..

- Advertisement -

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ – చిరంజీవి లాంటి సముజ్జీవులు కలిసి కాంపిటీషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుగువారు చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. దాదాపు 19 సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర పోరాటం చేసిన చిరు – బాలయ్య ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి సాక్షిగా రంగంలోకి దిగుతున్నారు. బాలకృష్ణ వందవ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి – చిరు ఖైదీ నెంబర్ 150 లు సంక్రాంతి బరిలో పోరాటానికి సిద్దం అవుతున్నాయి.

ఐతే కొన్ని నెలలుగా పూర్తిగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మీదే దృష్టిసారిస్తూ వచ్చిన బాలయ్య కూడా ఇప్పుడు తన 101వ సినిమా మీద ఫోకస్ మళ్లించారు. చిరు కంటే ముందుగా ఆయన తన తర్వాతి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తుండటం విశేషం. తన వందో సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కంటే ముందు ‘రైతు’ చిత్రాన్ని బాలయ్య పరిశీలించిన సంగతి తెలిసిందే. కృష్ణవంశీ ఓ విలక్షణమైన కథతో బాలయ్యను మెప్పించారు.

ఐతే వందో సినిమాగా మరింత ప్రతిష్టాత్మకమైన కథ కోరుకున్న బాలయ్య క్రిష్ స్టోరీకే ఓటేశారు. ఐతే ‘రైతు’ కథ కూడా ఆయనకు బాగానే నచ్చింది. దాన్నే తన 101వ సినిమాగా చేయబోతున్నారు బాలయ్య. ప్రస్తుతం కృష్ణవంశీ సందీప్ కిషన్ హీరోగా ‘నక్షత్రం’ చేస్తున్నారు. అది దాదాపుగా పూర్తి కావచ్చింది. బాలయ్య ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ పూర్తి చేసి ఫ్రీ అయ్యే సమయానికి బౌండెడ్ స్క్రిప్టుతో రెడీ అవనున్నాడు కృష్ణవంశీ. డిసెంబర్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.

Related

  1. చిరంజీవి కి ఈ కొత్త మోజు ఎందుకు పుట్టింది ?
  2. చిరంజీవి మీద దాడి చేయించింది ఎవరు ?
  3. నారా రోహిత్ ని తెగ పోగిడేసిన బాలయ్య
  4. తల్లికి గొప్ప గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -