Friday, May 17, 2024
- Advertisement -

చిరంజీవి కి ఈ కొత్త మోజు ఎందుకు పుట్టింది ?

- Advertisement -

ప్రస్తుతం తెలుగు టీవీ చానెళ్ల పరిధిలో హాట్ టాపిక్ ఏదైవనా ఉందంటే అది మెగాస్టార్ చిరంజీవి బుల్లి తెర ఎంట్రీ. తెలుగు ప్రేక్షకుడు కనీసం ఊహించలేని ఈ సన్నివేశం త్వరలో ఆవిష్కృతం కాబోతోంది. ఒకసారి ఈ అంశం మీద లోతుగా ఆలోచిస్తే అసలిప్పుడు చిరు కొత్తగా టీవీ షో చేయాల్సిన అవసరం ఏమిటి ? ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ? ఇది కేవలం ఛానెల్ కోసమే చేస్తున్నదా లేకపోతే వేరే కారణమేమన్నా ఉందా అనే ప్రశ్నలు ఖచ్చితంగా తలెత్తుతాయి.

ఆ ప్రశ్నలకు సమాధానం వెతుక్కునే ప్రయత్నమే మనం ఇప్పుడు చేద్దాం.ఎప్పుడో 9 ఏళ్ల క్రితం సినిమాల నుండి తప్పుకుని పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగారు చిరు. కానీ అక్కడ అయన తోలి ప్రయత్నమే బెడిసికొట్టింది. ఆ తరువాత రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలు అభిమానుల్లో ఆయన స్థాయిని దిగజార్చాయి. అప్పటి దాకా చిరంజీవి అభిమానులమని రొమ్మువిరుచుకుని తిరిగిన వారందరూ తమను దృష్టిలో పెట్టుకోకుండా చిరంజీవి తీసుకున్న నిర్ణయాలతో తలలు దించేసుకున్నారు.

కొందరు మనసు చంపుకుని చిరంజీవి పక్షం వీడితే మరికొందరు కష్టంగా ఉన్నా ఆయన వెంటే ఉంటాం అన్నారు. ఈ పరిణామాలతో చిరంజీవి ఛరీష్మా, అభిమానగణం చాలా వరకూ తగ్గిపోయింది. ఎంతలా అంటే మెగాస్టార్ హోదాలో పరిశ్రమను ఏలిన ఆయన తన పురోగమనానికి ఏదో కొత్త హీరోలా అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఎంట్రీ ఇచ్చేంత.ఇప్పుడు ఈ ఎంట్రీ కోసమే చిరు ముందుగా జనాల్లో తన మీద ఎంత ఆసక్తి ఉంది ? అసలు వాళ్ళు తన కోసం ఎదురుచూస్తున్నారా ? మళ్ళీ వెళితే పూర్వపు ఆదరణ చూపుతారా ? అనే విషయాలను తెలుసుకోడానికే ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేస్తున్నాడు అనిపిస్తోంది.

ఇదే పూర్తి కారణం కాకపోయినా ఒకప్పుడు తనకు 20 % వాటా ఉన్న ఛానెల్ గా, దాన్ని స్టార్ ఇండియాకు అమ్మిన తరువాత భారీ మొత్తం తెచ్చి పెట్టిన సంస్థగా, నిమ్మగడ్డ, నాగార్జున తనకు మంచి మిత్రులు అన్న పలు కారణాలు కూడా ఉన్నాయి. కానీ తనను తానూ పరీక్షించుకోడానికే ఈ ప్రయత్నం అన్నది మేజర్ కారణం. అసలు ఈ పరీక్ష ఎందుకంటే ఇప్పుడు ఆయన ‘ఖైదీ నెం 150’ పేరుతో మరోసారి జనాలకు దగ్గరవ్వాలని అనుకుంటున్నారు. కాబట్టి సినిమాని జనాలు ఎలా ఆదరిస్తారు. ఒకవేళ ఆదరించేంత ఆసక్తి వాళ్లకు లేకపోతే ఆ ఆసక్తిని వాళ్లలో రేకెత్తించడానికి టీవీ షో ద్వారా వాళ్లకు దగ్గరవ్వాలనే ఐడియాతో చిరు ఈ ప్రయత్నానికి పూనుకున్నారు. సో.. మెగాస్టార్ అంతటి ఆయనకే చేసిన పొరపాట్ల వలన తనను తాను తిరిగి జనాల్లో ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిది.

Related

  1. చిరు కోటి రూపాయలు ఇస్తాడు మనందరికీ
  2. చిరు 151 కోసం బోయపాటి ఓకే ? పవన్ కళ్యాణ్ సినిమా మరి ?
  3. చిరు రెబల్ స్టార్ అయితే.. బన్నీ పవర్ స్టార్!
  4. ఇదిగో.. చిరుతో కాజల్ మాట్లడుతోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -