Monday, May 13, 2024
- Advertisement -

నాగ‌బాబు కామెంట్స్‌పై స్పందించిన బాల‌య్య‌

- Advertisement -

గ‌త కొద్దికాలంగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు నంద‌మూరి బాల‌కృష్ణపై కామెంట్స్ చేసున్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ గ‌తంలో త‌న కుటుంబం గురించి మాట్లాడిన వాటిపై కౌంట‌ర్ ఇస్తున్నాడు నాగ‌బాబు.రోజుకు రెండు వీడియోలు విడుద‌ల చేస్తున్నాడు నాగ‌బాబు. వీటిలో బాల‌య్య చేసిన కామెంట్స్‌కు స‌మాధానం ఇస్తు ,ఆయ‌నపై మండిప‌డుతున్నాడు.తాజాగా నాగబాబు చేసిన కామెంట్స్‌పై బాల‌య్య స్పందించాడు.

ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమా ప్ర‌మోష‌న్‌లో బిజీగా ఉన్న బాలయ్య‌ను మీడియా ప్ర‌తినిధులు నాగ‌బాబు చేసిన కామెంట్స్‌పై స్పందించ‌మ‌ని అడిగారు. మీడియా అలా అడ‌గ్గానే ఒక్క‌సారిగా న‌వ్వేసిన బాల‌య్య …ఇప్పుడు స‌మ‌యం కాదు అని తెలిపారు. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకుంది క‌థా నాయ‌కుడు టీం. బాల‌య్య‌తో పాటు నటి విద్యాబాలన్, హీరో కల్యాణ్ రామ్‌తో క‌లిసి దేవుడిని దర్శించుకున్నాడు. నాగ‌బాబు సంగ‌తి త‌రువాత చూస్తార‌ని , అందుకే బాల‌య్య ఇప్పుడు స్పందించ‌లేద‌ని అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -