Saturday, April 27, 2024
- Advertisement -

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్..

- Advertisement -

తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రికి రోగులు బారులు తీరారు. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వల్ల కేసుల పెరుగుదల తగ్గు ముఖం పట్టింది. దాంతో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిని సంద‌ర్శిస్తున్నారు. ఆయనతో పాటు మంత్రి హ‌రీశ్ రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, ప‌లువురు అధికారులు కూడా వున్నారు.

గాంధీ ఆసుప‌త్రిలో క‌రోనా అత్య‌వ‌స‌ర వార్డును కూడా సీఎం సంద‌ర్శించారు. చికిత్స పొందుతోన్న క‌రోనా రోగుల‌ను ప‌రామ‌ర్శించారు.. వారికి ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయని.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కరోనాతో బాధపడుతున్న వారికి మనో ధైర్యాన్ని నింపారు.

ఇక ఓపీ విభాగంలోనూ క‌రోనా చికిత్స స‌దుపాయాల‌పై కేసీఆర్ ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆక్సిజ‌న్, ఔష‌ధాల ల‌భ్య‌త గురించి ఆసుప‌త్రి వైద్యుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు. జూనియ‌ర్ డాక్ట‌ర్లు, ఇత‌ర వైద్య సిబ్బందిని కేసీఆర్ అభినందించారు. కాగా, కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద పోలీసులు భారీగా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

ఆ స్టార్ హ్యాండ్ ఇవ్వడంతో అ!2 ఆగిపోయిందంటున్న డైరెక్టర్!

పావల శ్యామలను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి!

తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -