ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత, డైరెక్టర్, డిఎండికె పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుఝామున మూడు గంటల ప్రాంతంలో ఆయన శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో.. కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.
గత ఏడాది ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందని అప్పట్లో ఆయన తెలిపారు. ఆ తర్వాత చికిత్స తీసుకుని ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై డీఎండీకే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే డీఎండీకే విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మాత్రం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెబుతున్నారు. విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.
పవన్ తో మూవీపై బండ్ల గణేష్ ఏమన్నారో తెలుసా?
