Sunday, May 5, 2024
- Advertisement -

బప్పీ లహరిపై బయోపిక్.. హీరోగా రణవీర్ సింగ్ !

- Advertisement -

బాలీవుడ్ లో కొంతకాలం బయోపిక్ ల ట్రెండ్ నడిచింది. వరుసగా పొలిటికల్ లీడర్లు, సినిమా తారలు, క్రీడాకారులపై బయోపిక్ లు వరుసగా వచ్చాయి. ఇందులో ఇటీవల జయ లతిత జీవితం ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమా తప్ప దాదాపు అన్ని సినిమాలు విజయం సాధించాయి.

ఇటీవల మరణించిన బాలీవుడ్ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరిపై కూడా బయోపిక్ తీసేందుకు కూడా గతంలోనే ప్రయత్నాలు జరిగాయట. ఈ విషయాన్ని బప్పీ లహరి గతంలో ఒక టీవీ ఇంటర్య్వూలో వెల్లడించాడు. తాజాగా ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. తన జీవిత కథను బయోపిక్ తీయడానికి చాలామంది సంప్రదించారని , కానీ నేను వారి ప్రతిపాదనలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పాడు.

ఒకవేళ తన బయోపిక్ తీస్తే తాను యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ పోషిస్తే బాగుంటుందని బప్పీ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఆయన మరణించడంతో కొందరు బాలీవుడ్ నిర్మాతలు బప్పీ లహరి బయోపిక్ తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే బప్పీ లహరి ఆశించినట్టుగా ఈ మూవీలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

‘గంగూబాయి కతియావాడీ’ సినిమాతో మా అమ్మను అవమానిస్తున్నారు

ఆహాలో సందడి చేయనున్న క్యూట్ భామ

భీమ్లానాయక్‌పై కక్ష సాధింపు కొనసాగుతోందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -