Sunday, April 28, 2024
- Advertisement -

భీమ్లానాయక్‌పై కక్ష సాధింపు కొనసాగుతోందా ?

- Advertisement -

ఏపీలో టికెట్ ధరల పెంపు వ్యవహారంపై చాలా కాలంగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తాజాగా నాలుగో సారి భేటీ అయింది. ఈ సమావేశంలో టికెట్ ధరల పెంపు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినప్పటికీ పెంచిన రేట్లు ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న దానిపై క్లారిటీ కొరవడింది. ఈ నేపథ్యంలో మరోసారి కమిటీ చర్చలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. సినిమా టికెట్లు పెంచడానికి ఏపీ సర్కార్ సుముఖంగానే ఉన్నా .. కొన్ని సినిమాల విషయంలో వివక్షా పూరితంగా వ్యవహిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతోందని సినీ రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ హీరోగా వస్తున్న ‘భీమ్లా నాయక్‌’ చిత్రం విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందా? పవన్‌కల్యాణ్‌ పై కక్ష సాధింపు కొనసాగించనుందా? అనే ప్రశ్నలు లేవనెత్తున్నాయి. సినిమా టికెట్‌ రేట్లు పెంచడం పట్ల సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసినప్పటికీ.. విడుదలకు సిద్ధమైన ‘భీమ్లానాయక్‌’బృందం మాత్రం ఆనందంగా లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే టికెట్‌ రేట్లు పెంచారు కానీ.. దానిని అమలులోకి తెచ్చే జీవో ఇంకా రాలేదు. ఈ నెలాఖరులో వస్తుందని, మార్చి మొదటివారం నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయని చెబుతున్నారు.

అయితే ఈ నెల 25న ‘భీమ్లానాయక్‌’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. అదే కనుక జరిగితే ఏపీలో ‘భీమ్లానాయక్‌’కు అన్యాయం జరిగినట్లే. పవన్‌కల్యాణ్‌పై జగన్‌ ప్రభుత్వానికి ఉన్న కక్షే దీనికి కారణమని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తేయడం, 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వడం ఈ సినిమాకు కొంత వరకు ఊరట. ఈ నెల 21న ‘భీమ్లానాయక్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరగనుంది. గతంలో పవన్‌కల్యాణ్‌ ఓ వేడుకలో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పవన్‌ ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తిగా మారింది.

ఆ ఒక్క సినిమాతో మారిపోయిన త‌ల‌రాత‌

రాజ‌శేఖ‌ర్ ను సినిమా నుంచి ఎందుకు త‌ప్పించారు ?

బాలీవుడ్‌ను టాలీవుడ్ కైవసం చేసుకుంటుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -