Wednesday, April 24, 2024
- Advertisement -

ఛత్రపతి రీమేక్​ కోసం బెల్లంకొండ కసరత్తులు…

- Advertisement -

తెలుగులో ఘనవిజయం సాధించిన ఛత్రపతి సినిమాను హిందీలోకి రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ హిందీ రీమేక్​ లో తెలుగు యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్​ నటిస్తున్నాడు. ఈ మూవీ ద్వారానే బెల్లంకొండ బాలీవుడ్​కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్రప్రసాద్​ చిత్రానికి కథ అందించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ మూవీబాలీవుడ్​లో తెరకెక్కిస్తుండంతో కొన్ని మార్పులు చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్​ ఈ పనిమీదే ఉన్నారు. ఇక ఈ సినిమాకు మాస్​ చిత్రాల దర్శకుడు వీవీ వినాయక్​ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్​ మొదలు కావాల్సింది. . కానీ లాక్​డౌన్​తో ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ మూవీని పట్టాలెక్కించాని చూస్తున్నారట నిర్మాతలు . ఇందుకోసం బెల్లంకొండ శ్రీనివాస్​ తన ఇంట్లో కసరత్తుల చేస్తున్నారట. సినిమా కథకు అనుగుణంగా ఆయన మారిపోబోతున్నారట.

ఇక ఈ మూవీ కోసం బెల్లంకొండ హిందీ కూడా నేర్చుకుంటున్నారని టాక్​. హిందీ కోచ్‌ ఇంతియాజ్‌ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాడు. భారీ బడ్జెట్‌తో పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై జయంతిలాల్‌ గడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువ హీరోలందరూ పాన్ ఇండియా మూవీలతో బాలీవుడ్​లో సత్తా చాటాలని చూస్తుండగా, బెల్లంకొండ ఛత్రపతి మూవీ ద్వారా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

Also Read: అగ్ర హీరోలూ ఈ సారైనా వెండితెరపై దర్శనమిస్తారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -