ఆల్ఫా, డేల్టా వేరియంట్​ ఏదైనా.. కోవాగ్జిన్‌ అ సూపర్​..!

- Advertisement -

మనదేశంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కోవాగ్జిన్‌​, కోవిషీల్డ్​… ఇక స్పుత్నిక్​ వీ, మోడెర్నా వంటి వ్యాక్సిన్లకు కూడా అనుమతులు వచ్చినప్పటికీ ఇంకా అవి అందుబాటులోకి రాలేదు. ఇదిలా ఉంటే దేశీయంగా ఉత్పత్తి అయి.. స్వదేశీ టెక్నాలజీతో తయారైన వ్యాక్సిన్​ మాత్రం కోవాగ్జిన్‌​. ఇదిలా ఉంటే ఏ వ్యాక్సిన్​ సమర్థంగా పనిచేస్తుంది? అన్న విషయంపై మన దేశ ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయి. తొలుత కోవాగ్జిన్‌​ బాగా పనిచేస్తుందని జోరుగా ప్రచారాలు సాగాయి. అ తర్వాత కోవాగ్జిన్‌​ను డబ్ల్యూహెచ్​వో అనుమతి లేదని.. కోవాగ్జిన్‌​ వేయించుకున్నవారిని కొన్ని అగ్రదేశాలు తమ దేశానికి రానివ్వడం లేదంటూ వార్తలు వచ్చాయి. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొన్నది.

వ్యాక్సినేషన్​ ఇచ్చేది ఎలాగూ ప్రభుత్వమే కాబట్టి.. ప్రభుత్వం ఏ వ్యాక్సిన్​ ఇస్తే అది తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో వ్యాక్సిన్లపై పలు అధ్యయనాలు బయటకొస్తున్నాయి. తాజాగా కోవాగ్జిన్‌​ అద్భుతంగా పనిచేస్తుందని.. అల్ఫా, డేల్టా ఏ వేరియంట్​ అయినా కోవాగ్జిన్‌​ పనితీరు బాగుందని అమెరికాకు చెందని ఓ అధ్యయనం తేల్చిచెప్పింది.అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) కొత్త వేరియంట్లపై భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ వాక్సిన్ పై అధ్యయనం నిర్వహించింది.

- Advertisement -

భారత్​ బయోటెక్​ తయారుచేసిన కోవాగ్జిన్‌​ కొత్త వేరియంట్లపై అద్భుతంగా పనిచేస్తుందని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది. కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న వ్యక్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలపై SARS-CoV-2 ఆల్ఫా (B.1.1.7) డెల్టా (B.1.617) వేరియంట్లను సమర్థవంతంగా తటస్థం చేసే ప్రతి రోధకాలను ఉత్పత్తి చేసిందని ఎన్‌ఐహెచ్‌ తాజాగా వెల్లడించింది. కోవాగ్జిన్‌ టీకా కరోనాపై సమర్థంగా పనిచేస్తోందని ఎన్ఐహెచ్ డైరెక్టర్ ఆంథోనీ ఫౌసీ పేర్కొన్నారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు సాగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

Read This: కరోనాతో మెదడు కణజాలంపై ప్రభావం..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -