Saturday, April 27, 2024
- Advertisement -

విద్యార్థుల కోసం కేఏపాల్ దీక్ష..

- Advertisement -

ఏపీలో పది,‌ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విశాఖలో నిరసన దీక్ష చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఏపిలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో 86,035 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖ, నెల్లూరు జిల్లాల్లోనూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, వేలాది మంది చనిపోతున్నారని, విద్యార్ధులు,‌వారి తల్లిదండ్రుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని ఆయన కన్వెన్షన్ సెంటర్లో నిరసన దీక్షకు దిగారు. పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి 35 లక్షల మంది ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పాల్ హితవు పలికారు.‌

పరీక్షలు రద్దు చేసి పాస్ చేయమని తాను కోరడం లేదని, కనీసం రెండు నెలలపాటు పరీక్షలు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షల రద్దు కోరుతూ తాను వేసిన పిటీషన్ హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉందని పాల్ గుర్తు చేశారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కన్నుమూత

వైరల్ గా మారిన నటి రాధిక కొత్త లుక్!

తెలంగాణలో లాక్ డౌన్ ఆలోచన లేదు : మంత్రి ఈటెల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -