- Advertisement -
బెల్లంకొండ శ్రీనివాస్ , పూజ హెగ్డె హీరోగా ,హీరోయిన్లగా నటించిన చిత్రం సాక్ష్యం.గత వారం విడుదల అయిన ఈ సినిమా మిశ్రమ స్పందనతో మొదలైనప్పటికి కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. యూత్ ను ,మాస్ ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడంలో దర్శకుడు శ్రీవాస్ సక్సెస్ అయ్యాడు. భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో అదే జోరును కొనసాగిస్తోంది.
తొలి నాలుగు రోజుల్లోనే 40 కోట్ల గ్రాస్ ను రాబట్టేసిందని చెబుతున్నారు. ఇక శాటిలైట్ రైట్స్ రూపంలో 12 కోట్ల వరకూ రావడం విశేషం.పంచభూతాల నేపథ్యంలో నడిపించిన ఈ కథకి ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఈ సినిమాకు పూజా హెగ్డే గ్లామర్ బాగా హెల్ప్ అయిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.