రెండునెలల క్రితం కిడ్నాప్, వేధింపులకు గురైన హీరోయిన్ భావన.. ఇప్పుడు నోరు విప్పిది. గత ఫిబ్రవరిలో కొందరు కారులో ఆమెను కిడ్నాప్ చేసి.. లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనక ఏదో పెద్ద కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేశారు భావన.
మలయాళంకి చెందిన ఓ మ్యాగజైన్‌తో మాట్లాడిన ఆమె.. కేవలం డబ్బుకోసం తన కిడ్నాప్ చేసి.. వేధించలేదని.. దీని వెనుక పెద్ద కుట్ర వున్నట్లు ఆమె చెప్పింది. ఇక ప్లేస్ నుండి మరో ప్లేస్ కి కారులో తీసుకెళ్ళే డ్రైవర్ కి ఇలా చేసే దమ్ముందా..? దీని వెనకాల అసలు కారణం ఏంటి..? దీని వెనకాల ఎవరు ఉన్నారు..? ఎందుకు చేయించారు? ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. ఈ ఘటన వెనక నా శత్రువుల హస్తం ఉందని నేను చేప్పడం లేదు.. కానీ, కేవలం డబ్బు కోసమే నన్ను కిడ్నాప్ చేసి.. వేధించారా అనే కోణం లో నుంచి ఆలోచించినా లింక్స్ కనెక్ట్ కావడం లేదు.
చాలా ప్రశ్నలకు సమాధానం కావాలి. సరైన సమాధానాలు దొరికేవరకు పోరాడుతూనే ఉంటానని చెప్పింది భావన. చాన్స్‌ల కోసం రాజీపడనని, ఇలాంటి దారుణాలపై ఎవరూ మౌనంగా ఉండొద్దని.. అమె సూచించింది. ఈ అంశంలో పలువురు సినీ ప్రముఖులు భావనకు మద్దతుగా నిలిచారు. పోలీసుల దగ్గరకు ధైర్యంగా వెళ్లి, ఘటనపై భావన ఫిర్యాదు చేసిన తీరును అభినందించారు.
{youtube}I6_JR-Yfr6U{/youtube}
Related
