Monday, April 29, 2024
- Advertisement -

సీక్రెట్‍గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న భావ‌న.. ఎవరినో తెలుసా..?

- Advertisement -
Bhavana Secret Engagement

వారం రోజుల క్రితం మ‌ల‌యాళ న‌టి భావనపై దాడి జరిగిన విషయం తెలిసిందే. భావనపై జరిగిన ఈ దాడి పెద్ద సంచలనంగా మారింది. ఈ దాడి నుంచి భావన తొందరగా కోలుకోర‌ని అనుకున్నారు. అయితే భావన అందరికి షాక్ ఇస్తూ  దాడి జ‌రిగిన వారం రోజుల‌కే ఎంగేజ్‌మెంట్ చేసేసుకుంది. కన్నడ నిర్మాత నవీన్‌ను భావ‌న త్వరలోనే వివాహాం చేసుకోబోతున్నారు.

గురువారం వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ జరిగింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే  ఈ ఎంగేజ్‌మెంట్ కి హాజరయ్యారు. భావన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఈ ఎంగేజ్‌మెంట్‌కు వ‌చ్చిన భావన ఆప్తమిత్రురాలు, మాలీవుడ్‌ నటి మంజు వారియర్‌ కొత్తజంటతో కలిసి ఫొటో దిగారు. ఎంగేజ్‌మెంట్ జ‌రిగినా.. పెళ్లి డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదట. నవీన్‌తో కొంతకాలంగా భావనకు అనుబంధం ఉంది. వీరు 2014లోనే పెళ్లి చేసుకుంటారని భావించారు.

కానీ ఇరువురి బిజీ షెడ్యూల్‌ వల్ల పెళ్లి వాయిదా పడింది. భావన ప్రస్తుతం పృథీరాజ్‌ హీరోగా నటిస్తున్న ఆదమ్‌ మూవీలో నడిస్తోంది. ఇక భావ‌న గ‌తంలో న‌వీన్ నిర్మాత‌గా తీసిన రోమియో సినిమాలో నటించింది. అప్ప‌టి నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా పెద్ద దాడి నుంచి తేరుకుని కేవ‌లం వారం రోజుల్లోనే భావ‌న ఎంగేజ్‌మెంట్ చేసుకోవ‌డం నిజంగా ఆమెను మెచ్చుకోవాల్సిందే. 

{youtube}ONLBA7wg0Vc{/youtube}

Related

  1. భావనకు జరిగినట్లుగానే మరో సింగర్ కి.. చేసింది హీరో ధనుష్
  2. భావన కిడ్నాప్ వెనక.. స్టార్ హీరో హస్తం
  3. శ్రీహరి భార్య కి భయపడిన చిరంజీవి
  4. రవి, లాస్యల బంధంపై రవి భార్య సంచలన వ్యాఖ్యలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -