Sunday, May 11, 2025
- Advertisement -

13 కోట్ల కలెక్షన్

- Advertisement -

బిచ్చగాడు. ఓ డబ్బింగ్ చిత్రం. అయితే మాత్రమేం. రికార్డులు నమోదు చేసింది. తెలుగులో ఇంతవరకూ ఏ డబ్బింగ్ చిత్రానికి రాని కలెక్షన్లు ఈ చిత్రానికి వచ్చాయి. మామూలు సినిమాగా మార్కెట్లోకి వచ్చిన బిచ్చగాడు సినిమా ఏకంగా 13 కోట్ల రూపాయలు వసూలు చేయడం రికార్డు. తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన బిచ్చగాడు చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలోనూ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

పిచ్చెకారన్ పేరుతో కోలీవుడ్ లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ చదలవాడ శ్రీనివాస రావు సొంతం చేసుకున్నారు. డబ్బింగ్, ప్రచారంతో పాటు ఇతర ఖర్చులన్నీ కలిపి 50 లక్షల వరకూ అయ్యింది. అయితే వసూళ్లు మాత్రం 13 కోట్లు దాటాయి. అంటే పెట్టుబడికి 20 రెట్లు ఎక్కువ లాభాలు వచ్చాయన్న మాట. ఈ వేసవి సీజన్ లో ఇదే పెద్ద సినిమా.

పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు బ్రహ్మోత్సవాలను తట్టుకునే కాదు.. ఆ చిత్రాలను అధిగమించి కూడా బిచ్చగాడు సినిమా ఈ రికార్డు నెలకొల్పడం ఓ రికార్డుగానే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -