Thursday, April 25, 2024
- Advertisement -

‘కిల్లర్’ సినిమా రివ్యూ

- Advertisement -

బిచ్చగాడు సినిమా తో తెలుగు లో మార్కెట్ ని స్థాపించుకొని వరుస సినిమాల తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నటుడు విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఆయన కిల్లర్ అనే సినిమా తో మన ముందుకు వస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలల పాత్ర చేసిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే అందరినీ అలరించిన విషయం మనకి తెలిసిందే. ఈ సినిమా నేడు తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయింది. ఈ సినిమా పై మా సమీక్ష కింద చదవచ్చు.

కథ: కార్తికేయన్ (అర్జున్ సర్జా) ఒక ఇన్వెస్టిగేట్ ఆఫీసర్గా పని చేస్తూ ఉంటారు. ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ (విజయ్ ఆంటోని) కనిపిస్తాడు. ప్రభాకర్ వరుస హత్యలు చేసాడు అన్నది ఆరోపణ. ఈ నేపథ్యంలో కార్తికేయ ఆ హత్యలు చేసింది ప్రభాకరా కాదా తెలుసుకోవాలి. మరోవైపు ఆశీమ నర్వాల్ ఒక సాధారణ మధ్యతరగతి మహిళ గా కనిపిస్తుంది. ఆమెకు ఈ కథకి సంబంధం ఏంటి? అసలు హత్యలు చేసింది ప్రభాకరేనా? ఆ హత్యలు చేయడానికి వెనుక కారణమేంటి? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ సినిమాలో కూడా ఎప్పటిలాగానే తన ఎనర్జిటిక్ మరియు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అర్జున్ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. ఇప్పటికే ‘బిచ్చగాడు’ వంటి సినిమాలలో తన సత్తా చాటుకున్న విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో కూడా అంతే అద్భుతంగా నటించారు. తన నటనతో పాత్రకు ప్రాణం పోశారు అని చెప్పుకోవచ్చు. ‘జెస్సీ’, ‘నాటకం’ వంటి తెలుగు సినిమాలో కనిపించిన ఆశీమ నర్వాల్ ఈ సినిమాతో తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ లో మొదటి సినిమా అయినప్పటికీ ముందుగానే నటనలో అనుభవం ఉండటం వల్ల అది ఆమెకు చాలా ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సీత తన పాత్రకు పూర్తి న్యాయం పూర్తి న్యాయం చేశారు. ఎపిప్పటిలాగానే నాజర్ ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. సత్యం, సోమసుందరం, మయిల్సామి మరియు జాన్ విజయ్ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం: ఆండ్రూ లూయిస్ ఈ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారు. సినిమాలో బలమైన కథ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ గా పరిగణించవచ్చు. స్క్రీన్ ప్లే పరంగా కూడా ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా సినిమా మొత్తం ఆసక్తిగా సాగిపోయేలా చేశారు. దర్శకుడు మధ్యలో పాటలతో కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ, సినిమా మాత్రం ఆసక్తికరంగానే ఉంటుంది. దియా మూవీస్ పతాకంపై ప్రదీప్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఈ సినిమాలో సైమన్ కె కింగ్ అందించిన మ్యూజిక్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే నేపథ్య సంగీతం ప్రతి సీన్ ను చాలా అద్భుతంగా ఎలివేట్ చేస్తుంది. ముఖేష్ అందించిన విజువల్స్ మరియు కెమెరా యాంగిల్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. సినిమా పై మరింత ఆసక్తిని పెంచడానికి పెంచడంలో ముఖేష్ సినిమాటోగ్రఫీ దోహదపడిందని చెప్పొచ్చు. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ లో కూడా ఎటువంటి తప్పులు లేవు.

తీర్పు: క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి న్యాయం చేస్తూ ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది. సినిమా మొదటి హాఫ్ చాలా ఆసక్తికరంగా సాగి పోతూ ఉంటుంది. విజయ్ ఆంటోని, అర్జున్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తారు. ‘దృశ్యం’, ‘పాపనాశం’ వంటి సినిమాల లాగా ఈ సినిమాని కూడా ఎక్కడా బోరు కొట్టకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మొదటి హాఫ్ లోని రెండు డ్యూయెట్ లు కొంచెం బోర్ అనిపిస్తాయి కానీ కథ ప్రకారం గా మాత్రం ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఆఖరి 20 నిమిషాలు హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఎమోషనల్ గా ఉంటుంది. ఓవరాల్గా ‘కిల్లర్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు కచ్చితంగా చూడాల్సిన థ్రిల్లర్ సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -