Sunday, May 12, 2024
- Advertisement -

కబాలి వల్ల బిచ్చగాడికి లాభాలు!

- Advertisement -

తెలుగులో విజయ్ ఆంటోనీ దశ మారిపోయింది. బిచ్చగాడు సినిమా తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు చిన్న చిత్రంగా మొదలై నిధానంగా థియేటర్స్ పెంచుకొని దాదాపు అన్ని సెంటర్స్ 50 రోజులు ఆడింది. అదే టైంలో వచ్చిన చిన్న సినిమాలు కాని, పెద్ద సినిమాలు కాని బిచ్చగాడి ముందు నిలువలేక పోయాయి.

ఈ చిత్రంలో మొదట తెలుగు రీమేక్ కోసం రానాని అడితే రానా చేయను అని చెప్పాడట. ఇప్పుడు రానా చేయకపోవడమే విజయ్ అంటోనికి కలిసి వచ్చింది. ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి పోటీ పడుతున్నారు. కన్నడలో ఈగ విలన్ కిచ్చా సుదీప్ బిచ్చగాడు రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తెలుగులో ఇంకా విజయవంతగా ప్రదర్శంచబడుతుంది.

నిన్న భారీగా కబాలి చిత్రం రిలీజ్ అయ్యింది. అయితే కబాలి కోసం వెళ్లిన వారికి టికెట్స్ దొరకకపోవడంతో పక్కనే ఉన్న బిచ్చగాడు సినిమాకి వెళ్లుతున్నారు. కబాలి సినిమా వల్ల కూడా బిచ్చగాడు సినిమాకి కలిసి వస్తోంది. నిన్న కూడా ఈ బిచ్చగాడు సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయట. కబాలి సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు బిచ్చగాడు సినిమాకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారట. మొత్తానికి ఈ వికెండ్ లో మరో సారి కలక్షన్స్ తో బిచ్చగాడు టాప్ లేపుతాడు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

Related

  1. “బిచ్చగాడు” వసూళ్లు 16కోట్లు..
  2. బిచ్చగాడు ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు!
  3. బిచ్చగాడు రీమేక్ వద్దన్నాడు
  4. బిచ్చగాడు టైటిల్ కి ఇబ్బందులు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -