Thursday, May 2, 2024
- Advertisement -

రెజీనాతో రొమాన్స్ చేయబోతున్న దర్శకుడు

- Advertisement -

తెలుగులో వరస అవకాశాలతో దూసుకెళ్తుంది అందాల భామ రెజీనా. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ  నారా రోహిత్‌తో క‌ల‌సి జ్యో అచ్యుతానంద అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు అదే డైరెక్టర్ తో రెజీనా రొమాన్స్ చేయబోతుంది. హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం హంట‌ర్‌.

ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా న‌వీన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, రెజీనా జంట‌గా నటించబోతున్నారట. సెక్స్ మానియా ఉన్న యువ‌కుడిగా అవ‌స‌రాల శ్రీ‌నివాస్ క‌నిపించ‌నున్నాడు.

బాలీవుడ్ లో కాస్త ఘాటుగా తీసిన చిత్రం ఇది. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా ఆ డోసు కాస్త త‌గ్గిస్తున్నార‌ని తెల‌స్తోంది. మ‌రోవైపు న‌క్ష‌త్రం మూవీలోనూ కీ రోల్ చేస్తోంది. అంటే రెజీనా చేతిలో ఉన్న మూడో సినిమా ఇద‌న్న‌మాట‌. ఇక అతి త్వరలో ఈ హంట‌ర్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Related

  1. రెజీనా అలా గర్భం దాల్చింది
  2. రెజీనా నే కావాలంటా..!
  3. రకుల్లో ఉన్నదేంటి…? రెజీనాలో లేనిదేంటి..?
  4. సాయిధ‌ర‌మ్‌తేజ్ ,రెజీనా ప్రేమ పడ్డారట?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -