Tuesday, May 7, 2024
- Advertisement -

ఆనందయ్య ఇచ్చేది మందు కాదురా.. చట్నీరా: బాబు గోగినేని

- Advertisement -

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికి పోతున్నాయి. లక్షల సంఖ్యలో కేసులు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.ముఖ్యంగా అధిక జనాభా ఉన్న భారత దేశంలో కరోనా మొదటి దశ కంటే రెండో దశ ప్రజలపై తీవ్రం ప్రభావం చూపిస్తోంది.భారత ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు
ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.అలాగే దేశంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

ప్రస్తుతం భారత దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుల ద్వారా ఎంతోమంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడుతున్నారని
కొద్దిరోజులగా ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై ఎంతో మంది ప్రముఖులు స్పందించి వారి వారి వాదనలను వినిపించారు.తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందు పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Also read:సినిమా ప్లాప్ అయ్యింది.. మొత్తం డబ్బు మహేష్ బాబు వెనక్కి ఇచ్చి నన్ను కాపాడాడు: నిర్మాత అభిషేక్ నామా!

ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందు పై తాజాగా ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ ఫేమ్ బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య తయారు చేస్తున్నది మందు కాదు చట్నీ అని ఇది తీసుకోవడం వల్ల ప్రాణాలతో బయట పడకుండా చస్తారంటూ బాబు గోగినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా కరోనా 14 రోజులలో తగ్గిపోతుంది. అలాంటిది పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కృష్ణ పట్నం వెళ్లి మందు తీసుకుంటేనే నయమవుతుందనడం సమంజసం కాదు. ఇప్పటికైనా కృష్ణ పట్నం వెళ్లి మందులు తీసుకున్న వారు అందరూ కూడా మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమాజానికి మంచి చేసే వారమవుతాం. లేదంటే మన ప్రాణానికే కాకుండా ఇతరులకు కూడా హాని కల్పించిన వారవుతారని బాబు గోగినేని తెలిపారు. ఈ విధంగా బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఆనందయ్య ఇచ్చేది మందు కాదురా.. చట్నీరా: బాబు గోగినేని

Also read:ఆ ఫొటో చిరునవ్వులు తెప్పించింది: నమ్రత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -