Saturday, April 20, 2024
- Advertisement -

మాస్క్ పెట్టుకోలేదని కాళ్లు, చేతులకు మేకులు దింపిన యూపీ పోలీసులు

- Advertisement -

మాస్కు పెట్టుకోలేదని ఓ వ్యక్తిని పోలీసులు చిత్రహింసలకు గురి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీ ప్రాంతం బరాదరీలో జరిగింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల పోలీసులు మంచి మాటలతో చెబుతుంటే.. మరికొన్ని చోట్ల తాట తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీ ప్రాంతం బరాదరీలో పోలీసులు ఓ వ్యక్తి పట్ల దారుణంగా ప్రవర్తించారు.

సోమవారం రాత్రి పది గంటల సమయంలో తన కుమారుడి ఇంటి ముందు భాగంలో కూర్చొని ఉన్నాడని.. ఆ సమయంలో ముగ్గురు పోలీసులు వచ్చి తన కుమారుడిని మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించగా తాను ఇంటి ముందు కూర్చున్నానని.. ఇతరులు ఎవ్వరు ఇక్కడలేరని అందుకే మాస్కులు పెట్టుకోలేదని కుమారుడు పోలీసులకు సమాధానమిచ్చాడు. ఈ విషయంలో పోలీసులకు తన కుమారుడికి మద్య వాగ్వాదం పెరిగి అతడిని పట్టుకొని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అక్కడ యువకుడి చేతికి, కాలిపై మేకులు గుచ్చి ఘోరమైన హింసకు పాల్పపడ్డారు పోలీసులు. దాంతో కుటుంబ సభ్యులు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీనియర్ ఎస్‌పి రోహిత్ సజ్వాన్ మీడియాతో మాట్లాడారు. అతను మాస్క్ ధరించనందుకు కాదని.. గతంలో అతడిపై పలు క్రిమినల్ కేసులున్నాయని, కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నాడని తెలియజేశారు.

ఏపిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా..

నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 150 మంది గల్లంతు!

భర్తపై అలా కామెంట్స్ చేసిన యాంకర్ సుమ…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -