సత్యదేవ్ కొన్ని సినిమాలలో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సత్యదేవ్ తాజాగా హీరోగా మారి ‘బ్లఫ్ మాస్టర్’ అనే సినిమాను తెరకెక్కించాడు. మొదట ఈ ట్రైలర్‌ను అందరు లైట్ తీసుకున్నారు. కాని ట్రైలర్‌ను చూసిన ప్రతి ఒక్కరు బాగుందని చెప్పడంతో ప్రతి ఒక్కరు ఈ ట్రైలర్‌ను చూస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని అమాయకులైన ప్రజలను మోసం చేయడం ద్వారా ఈజీ మనీకి అలవాటు పడిన యువకుడి కథే ఈ బ్లఫ్ మాస్టర్.
కథానాయకుడి పాత్ర తీరుతెన్నులను ట్రైలర్లోనే చూపించి ఆసక్తి రేపారు. మీ ఖాతాలో ఉన్న బాలన్స్ బ్యాంకు అకౌంట్ నెంబరంత మారిపోతుంది అని చెప్పించడం ద్వారా హీరో పాత్ర ఎన్ని మాయ మాటలు చెబుతుందో అర్థమైపోతుంది.ట్రైలర్‌లోనే సినిమా కథ ఏంటో చెప్పాడు దర్శకుడు.ఇక సత్యదేవ్ హీరోకి తగినట్లుగా నటించాడు.మొత్తనికి ట్రైలర్‌ని ఆకట్టుకునే విధాంగా కట్ చేశారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నందిత నటిస్తుంది.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!