ప్రఖ్యాత దర్శకుడు శంకర్.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శంకర్ సినిమా అంటే కచ్చితంగా పాన్ఇండియా స్థాయిలోనే ఉంటుంది. ఇక ఇప్పటికే చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. కాబట్టి.. చరణ్ తో ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దిల్ రాజు.
ఇదిలా ఉంటే ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని టాక్. రామ్ చరణ్ డ్యుయల్ రోల్లో అలరించబోతున్నాడట. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ ఉందట. దాదాపు 40 నిమిషాల పాటు ఈ పాత్ర తెర మీద సందడి చేయబోతుందట. ఈ రోల్ కోసం ఇప్పటికే పలువురు నటులను సంప్రదిస్తున్నారు. బాలీవుడ్లో ఈ రోల్ అక్షయ్ కుమార్.. సౌత్‌లో విజయ్ సేతుపతి లేదా విజయ్ లేదా ఉపేంద్ర చేయబోతున్నట్టు టాక్.
శంకర్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతూ ఉంటాయి. శంకర్ గత చిత్రాల్లో సైతం బాలీవుడ్ నటులు సందడి చేశారు. తాజాగా చరణ్.. శంకర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కనిపించబోతున్నట్టు టాక్. శంకర్ సినిమా రోబో 2.0లో అక్షయ్ విలన్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. చరణ్ సినిమాలో అక్షయ్ నటిస్తున్నడన్న విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
Also Read
త్రిష పెళ్లి ఫిక్స్..? వరుడు ఎవరంటే..?
ఆసియా ఖండంలో అందగాడు ఎవరో తెలుసా..?
మాస్కు పెట్టుకో సిన్నప్పా.. నారప్పను ఇలా వాడుకున్నారా?
