Monday, April 29, 2024
- Advertisement -

శంకర్​.. చరణ్​ సినిమాలో బాలీవుడ్ బడా స్టార్..!

- Advertisement -

ప్రఖ్యాత దర్శకుడు శంకర్​.. మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​ తేజ్​ కాంబినేషన్​లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శంకర్​ సినిమా అంటే కచ్చితంగా పాన్​ఇండియా స్థాయిలోనే ఉంటుంది. ఇక ఇప్పటికే చరణ్​ నటించిన ఆర్​ఆర్​ఆర్​ పాన్​ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. కాబట్టి.. చరణ్ తో ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దిల్​ రాజు.

ఇదిలా ఉంటే ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని టాక్​. రామ్​ చరణ్​ డ్యుయల్ రోల్​లో అలరించబోతున్నాడట. ఈ సినిమాలో ఓ పవర్​ ఫుల్​ రోల్​ ఉందట. దాదాపు 40 నిమిషాల పాటు ఈ పాత్ర తెర మీద సందడి చేయబోతుందట. ఈ రోల్​ కోసం ఇప్పటికే పలువురు నటులను సంప్రదిస్తున్నారు. బాలీవుడ్​లో ఈ రోల్​ అక్షయ్​ కుమార్​.. సౌత్​లో విజయ్​ సేతుపతి లేదా విజయ్​ లేదా ఉపేంద్ర చేయబోతున్నట్టు టాక్​.

శంకర్​ సినిమాలు పాన్​ ఇండియా స్థాయిలో తెరకెక్కుతూ ఉంటాయి. శంకర్​ గత చిత్రాల్లో సైతం బాలీవుడ్​ నటులు సందడి చేశారు. తాజాగా చరణ్​.. శంకర్​ కాంబినేషన్​లో తెరకెక్కబోయే చిత్రంలో బాలీవుడ్​ స్టార్​ అక్షయ్​ కనిపించబోతున్నట్టు టాక్​. శంకర్ సినిమా రోబో 2.0లో అక్షయ్ విలన్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. చరణ్ సినిమాలో అక్షయ్ నటిస్తున్నడన్న విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Also Read

త్రిష పెళ్లి ఫిక్స్..​? వరుడు ఎవరంటే..?

ఆసియా ఖండంలో అందగాడు ఎవరో తెలుసా..?

మాస్కు పెట్టుకో సిన్నప్పా.. నారప్పను ఇలా వాడుకున్నారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -