త్రిష పెళ్లి ఫిక్స్..​? వరుడు ఎవరంటే..?

సినిమా హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలు పెళ్లిళ్లపై అప్పుడప్పుడూ రూమర్స్​ రావడం సహజమే. కొన్ని సార్లు అవి నిజమవుతుంటాయి. మరికొన్ని సందర్బాల్లో రూమర్స్​గానే మిగిలిపోతూ ఉంటాయి. తెలుగులో అగ్రతారగా వెలుగొందిన కాజల్​ అగర్వాల్ ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్​ కిచ్లును పెళ్లాడిన విషయం తెలిసిందే. చాలా కాలంగా వీరు ప్రేమలో ఉన్నప్పటికీ వీరి వ్యవహారం బయటకు పొక్కలేదు. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ నటి త్రిష త్వరలోనే ఓ దర్శకుడిని పెళ్లి చేసుకోబోతుందంటూ తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలోనే త్రిషకు వరుణ్​ మణియన్​ అనే వ్యాపారవేత్తతో ఎంగేజ్​ మెంట్​ అయ్యింది. ఏ కారణం వల్లనో వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత నిశ్చితార్థం రద్దైంది. ఆ తర్వాత ఓ ప్రముఖ తెలుగునటుడితో ఆమె ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ సదరు నటుడికి ఈ లాక్​డౌన్​లోనే పెళ్లి కూడా అయ్యింది. ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా త్రిష తెలుగు సినిమాల్లో నటించడం లేదు. చెన్నైలోనే ఉంటూ తమిళ సినిమాల్లో నటిస్తోంది.

కాగా త్రిష ప్రస్తుతం ఓ తమిళ డైరెక్టర్​తో క్లోజ్​గా ఉన్నట్టు సమాచారం. వీళ్లిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు టాక్​. పెళ్లికి ఇరు కుటుంబాల తరఫు వారు కూడా ఒప్పుకున్నారట. ప్రస్తుతం త్రిష కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తోంది. వెబ్​సీరిస్​లు కూడా చేస్తోంది. కాగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఓ నాయికగా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అఫిసిఅల్ ప్రకటన రావాల్సి ఉంది.

Also Read

ఆసియాకే అందగాడు ప్రభాస్​..!

సార్​ మీ కులపోడినే.. కొద్దిగా చాన్స్​ ఇవ్వరూ..!

సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..!

Related Articles

Most Populer

Recent Posts