Sunday, April 28, 2024
- Advertisement -

బన్నీ కోసం వచ్చేస్తున్న సన్నీ..!

- Advertisement -

ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ పాన్​ ఇండియా హీరోగా మారేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే పుష్ప చిత్రం తెరకెక్కుతోంది. సుకుమార్​ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్​గా చేస్తోంది.

ఇప్పటికే విడుదలైన పుష్ప టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నది. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా నిలిచింది. సుకుమార్ -బన్నీ కాంబినేషన్ లో మూవీ వస్తోంది అంటే.. ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఆర్యలో ఆ అంటే అమలాపురం, ఆర్య 2లో రింగ రింగ ఐటమ్ సాంగ్స్ హిట్ అయ్యాయి. తాజాగా పుష్పలో కూడా ఐటమ్ సాంగ్ పెడుతున్నారు. ఈ సాంగ్ బాలీవుడ్​ నటి, పోర్న్​ స్టార్​ సన్నీ లియోన్​ చేయబోతున్నట్టు టాక్​. ఇప్పటికే పుష్ప యూనిట్​ సన్నిని కలిశారట.

స్పెషల్​ సాంగ్ చేసేందుకు ఆమె కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. సన్నిలియోన్​ స్పెషల్ సాంగ్​లో నటిస్తుండటంతో అల్లు అర్జున్​ ఫ్యాన్స్​ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇటీవల తెలుగు హీరోలంతా పాన్​ఇండియా సినిమాలు చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఆర్​ఆర్​ఆర్​ విడుదలైతే తారక్​, చరణ్​ పాన్​ఇండియా హీరోలు కానున్నారు. ఇక ప్రభాస్​ ఇప్పటికే దేశవ్యాప్తంగా మార్కెట్​ సంపదించి దుమ్ము దులుపుతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్​ కూడా వీరి బాటలోనే పయనిస్తున్నాడు.

Also Read

ఆసియా ఖండంలో అందగాడు ఎవరో తెలుసా..?

ప్రభుత్వాలు అనుమతిచ్చినా.. సినిమాల విడుదలకు అడ్డేమిటి?

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

Watch

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -