Saturday, April 20, 2024
- Advertisement -

ఆకాశంలో అద్భుత దృశ్యం

- Advertisement -

ఆకాశంలో అప్పుడప్పుడు అద్భుత దృశ్యాలు ఆవిష్కృతం అవుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాల సమయంలో ఇంద్రధనుస్సు చూస్తుంటే రెండు కళ్లు సరిపోవు. తాజాగా ఆకాశంలో బుధవారం అద్భుతం చోటుచేసుకుంది. ఈ దృశ్యం ప్రజలను ఆకట్టుకుంటోంది. సూర్యుడి చుట్టూ ఇంద్ర ధనస్సు కాంతి వలయంగా ఏర్పడింది.

బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఇది కనిపించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ దృశ్యాలు చూపరులను కనువిందు చేశాయి. ఈ సుందర దృశ్యాన్ని చూసి అశ్చర్యానికి గురైన ప్రజలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో, వాట్సాప్ స్టేటస్ లో అప్ లోడ్ చేశారు.

ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడుతూ ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సులా ఏర్పడిన వలయాన్ని సైన్స్ భాషలో ‘మూన్ రింగ్’ లేదా ‘వింటర్ హాలో’ అంటారని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -