Monday, April 29, 2024
- Advertisement -

30 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్న సీరియల్ హీరో.. ఎవరంటే?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఒకే కుటుంబం నుంచి ఎంతోమంది అన్నా తమ్ముళ్లు, అక్క చెల్లెలు ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరు వెండితెర పై మరొకరు బుల్లితెరపై కొనసాగిస్తూ దూసుకుపోతున్న సెలబ్రిటీలలో బాలాదిత్య‌, కౌశిక్‌ ఒకరు.

తాజాగా ఈ ఇద్దరు సోదరులు బుల్లితెరపై ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమ కెరీర్ లోని జరిగిన కొన్ని అనుభవాలను పంచుకొని ఎంతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా అలీ వీరిని ఉద్దేశించి ఇండస్ట్రీకి ఎవరు ముందు వచ్చారు అని అడగగా.. అందుకు కౌశిక్ నేనే ముందుగా ఇండస్ట్రీలోకి వచ్చానని వెంటనే సమాధానం చెబుతాడు. మరి నీదని బాలాదిత్యని అడగగా అందుకు ఆదిత్య సమాధానం చెబుతూ…”ఈ నెలతో సరిగ్గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని సమాధానం చెబుతాడు.

Also read:ప్రేయసి కోసం రూ.23 కోట్ల విలువచేసే విల్లా కొన్న స్టార్ హీరో?

బాలాదిత్య బాలనటుడిగా ఆరు భాషలలో సుమారు నలభై ఒక్క చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బాలాదిత్య బాల నటుడిగా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించారు.ఈ క్రమంలోనే ఒకసారి దివంగత నటుడు శోభన్ బాబు తన దగ్గరకు పిలిచి ఒక కాగితంపై నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావని రాసి సంతకం చేసి ఇచ్చారని అప్పటి సంఘటనను ఆదిత్య ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ విధంగా వీరి మధ్య సాగే మరి కొన్ని సరదా ముచ్చట్లు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఎదురు చూడాలి. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

Also read:వెబ్ సిరీస్ లలో స్టార్ హీరో.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -