Friday, April 19, 2024
- Advertisement -

రైతు భరోసా కేంద్రాలు.. వైసీపీ నేతలకు ఎటిఎం మిషన్లు !

- Advertisement -

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా క్షేత్ర స్థాయిలో ఉపయోగకరంగానే ఉందని చెప్పవచ్చు. ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా అన్నీ పనులు సచివాలయంలోనే జరుగుతున్నాయి. ఇక సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన రౌతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సంభంధించిన అన్నీ రకాల సమస్యలను పరిస్కరిస్తోంది జగన్ సర్కార్. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఇవి క్షేత్ర స్థాయిలో రైతులకు నిజంగానే అనుకూలంగా ఉన్నాయా ? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. రైతు భరోసా, పి‌ఎం కిసాన్ పథకాలతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ, పంట భీమా నమోదు, విత్తనాలు, ఎరువులు, ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్ వంటి పనులు అన్నీ ఆర్బీకేల ద్వారానే జరుగుతాయని జగన్ సర్కార్ చెప్పొకొచ్చింది..

కానీ రైతులకు వీటి విషయంలో సమస్యలు తలెత్తినప్పుడు ఆర్బీకే లోని అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గత కొంత కాలంగా రైతులనుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. రైతులకు ఆర్బీకే ల ద్వారా చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పినప్పటికి, కేవలం వైసీపీ నేతలకు, వారి అనుకూల వ్యక్తులకు మాత్రమే ఆర్బీకే లో పనులు జరుగుతున్నాయని సాధారణ రైతులు వాపోయిన పరిస్థితులు చాలానే ఉన్నాయి. ఇక ఇటీవల రైతు భరోసా కేంద్రాలపై ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చేన్నాయుడు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వైసీపీ నేతలు వందల కోట్లు కాజేశారని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో లెక్కకు మించి దోపిడి చేస్తున్నారని, టీడీపీ నేతలు తరచూ విమర్శిస్తూనే ఉన్నారు.

దాంతో ఆర్బీకే పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఇటీవల సి‌ఎం జగన్ కూడా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుకోలు విషయంలో కనీస మద్దతు ధర కన్నా ఒక్క పైసా కూడా తగ్గకూడదని, రైతులకు ఏంఎస్ఫి ధర అందించాల్సిందేనని సి‌ఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. మరి ఇప్పటివరకైతే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో వైసీపీ నేతలకు రైతు భరోసా కేంద్రాలు ఏటీఎం మిషన్లుగా ఉన్నాయనే విమర్శలు గట్టిగానే వినిపించాయి. అయితే సి‌ఎం జగన్ ఇటీవల ఆర్బీకే లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టె దిశగా ముందడుగు వేశారు. మరి ఇకనుంచైనా రైతు భరోసా కేంద్రాలు సాధారణ రైతులకు అండగా నిలుస్తాయో లేదో చూడాలి.

Also Read : కాళ్ళు మొక్కితే ఓట్లు వేస్తారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -