Friday, April 26, 2024
- Advertisement -

వామ్మో.. “లైగర్ ” కు భారీగా సెన్సార్ కట్లు !

- Advertisement -

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ డాసింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కిన మాస్ మసాలా చిత్రం ” లైగర్ ” . ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా వచ్చిన సెన్సార్ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో వల్గర్ సీన్స్ తో పాటు, వల్గర్ డైలాగ్స్ కూడా చాలానే ఉండడంతో సెన్సార్ బోర్డ్ భారీగా కట్స్ చెప్పిందట. ” సాలా క్రాస్ బ్రిడ్ ” ట్యాగ్ లైన్ తోనే ఈ మూవిలో వాల్గరిటీ ఎలా ఉంటుందో మూవీ టిమ్ చెప్పకనే చెప్పింది.

ఇక ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ దాదాపుగా 7 కట్స్ చెప్పినట్లు సమాచారం. సహజంగానే పూరీ మూవీస్ లో హీరోలలో కాస్త వర్గారిటీగానే అట్టిట్యూడ్ ఉంటుంది. ఇక లైగర్ లో ఆ డోస్ పూరీ జగన్నాథ్ మరింత పెంచినట్లు సినివర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. అందువల్లే సెన్సార్ టిమ్ నుంచి కూడా మూవీకి కట్స్ ఎక్కువగానే వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ మూవికి సెన్సార్ బోర్డ్ యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై కేవలం టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండ కు ఆ స్థాయి విజయం దక్కలేదు. దాంతో ” లైగర్ ” మరో అర్జున్ రెడ్డి అవుతుందని రౌడీ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి లైగర్ తో విజయ్ దేవరకొండ ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Also Read: SSMB28 : మహేశ్ కు మరో ” పోకిరి ” పక్కా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -