Wednesday, May 1, 2024
- Advertisement -

హైపర్ ఆదికి ఐ లవ్ యూ చెప్పిన కాలేజీ అమ్మాయ్.. చివరికి?

- Advertisement -

బుల్లి తెర కామెడీ షో జబర్దస్త్ కోట్లాది ప్రజల హృదయాల తాకి వారి ఆదరణ పొందుతోంది.
అలాగే ఈ షో ద్వారా ఎంతో మంది నటులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ ప్రోగ్రాంలో ఆది తనదైన పంచ్‌లతో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదె ఊపుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.

తరుచూ ఏదో ఒక షోలో సందడి చేసే హైపర్ ఆది ఇటీవలే యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాం కి వెళ్ళాడు. అక్కడ ఓ అమ్మాయి నేరుగా హైపర్ ఆదికి ఐ లవ్ యూ అని చెప్పేయడంతో అంతా షాకయ్యారు. వివరాల్లోకి వెళితే వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఈ షోకు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, దీపిక పిల్లి, భానూశ్రీ కంటిస్టెంట్లుగా విచ్చేసి సందడి చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:రజినీకాంత్ మోహన్ బాబు ఫోటోపై మంచు లక్ష్మి హాట్ కామెంట్?

సిని సెలబ్రెటీలతో ఎంతో ఉత్సాహంగా సాగే క్యాష్ ప్రోగ్రాం కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది.తాజాగా వదిలిన ఈ ప్రోమోలో యాంకర్ సుమ, ఆది, రాంప్రసాద్ పంచులు ప్రేక్షకులకు విపరీతమైన నవ్వు తెప్పించాయి.ప్రోమో చివర్లో ఓ కాలేజీ అమ్మాయి వేదికపైకి వచ్చి హైపర్ ఆదికి ఐ లవ్ యూ అని చెప్పడంతో ఆది తెగ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉండగా, రాంప్రసాద్ దానికి బదులుగా ఇంట్లో మాట్లాడి సంబంధ ఓకే చేద్దామా అని ఆదిని అడగగా స్టేజ్ మొత్తం నవ్వుల వర్షం కురిసింది.

Also read:ఆ ఫొటో చిరునవ్వులు తెప్పించింది: నమ్రత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -