Sunday, May 5, 2024
- Advertisement -

భర్త చెంప చెళ్లుమనిపించిన నటి.. వైరల్ వీడియో!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో నువ్వు నేను, శ్రీరామ్, నేనున్నాను వంటి చిత్రాలలో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి అనిత ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటూ బుల్లి తెరపై తన హవా కొనసాగిస్తున్నారు. బుల్లితెరపై గృహలక్ష్మి వంటి సీరియల్లో విలక్షణ పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తున్న అనిత తన భర్త రోహిత్ రెడ్డిను ఆటాడుకుంది.

నటి అనిత తన భర్త రోహిత్ రెడ్డి తో ఫ్రాంక్ అని చెబుతూ తన భర్త చెంప చెల్లుమనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అనిత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియోలో రోహిత్ రెడ్డి ఒక కుర్చీలో కూర్చోగా అనిత తన వెనకాల నిలబడి తన చేతిలో దారం పట్టుకొని ఏదో మ్యాజిక్ చేస్తున్నట్లు నటించింది. ఆ ధారాన్ని రోహిత్ చెవిలో నుంచి బయటకు తీస్తున్నట్లు నటించింది.

Also read:మరోసారి రామ్ చరణ్ తో జతకట్టనున్న బాలీవుడ్ భామ?

ఈ విధంగా రోహిత్ చెవిలో నుంచి దారం బయటికి తీస్తున్న క్రమంలోనే అతని చెంప చెల్లుమనిపించింది. ఉన్నఫలంగా తనపై చేయి చేసుకోవడంతో ఎంతో షాక్ కి గురైన రోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనిత ఈ వీడియోని షేర్ చేస్తూ ఈ మ్యాజిక్ ట్రిక్ అందరి భార్యలకు నచ్చుతుంది.. తప్పకుండా ప్రయత్నించండి అంటూ ఈ వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అయ్యో పాపం రోహిత్ అనగా… మరికొందరు తప్పకుండా అతను రివేంజ్ తీర్చుకుంటారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also read:రజినీకాంత్ మోహన్ బాబు ఫోటోపై మంచు లక్ష్మి హాట్ కామెంట్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -