Tuesday, May 7, 2024
- Advertisement -

ఈ సెలబ్రిటీలకే కవల పిల్లలు ఉన్నారు.. ఎవరో చూడండి..!

- Advertisement -

మంచు విష్ణు :
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు అయిన విరానికా రెడ్డిని 2009లో హీరో మంచు విష్ణు వివాహం చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా ఇద్దరు కవులు పిల్లలు పుట్టారు. ఆడ పిల్లలు అయిన వీరికి ఆరియానా, వీవియానా అనే పేర్లు పెట్టారు. ఆ తరువాత విష్ణు ఓ అబ్బాయి మరియు అమ్మాయికి జన్మనిచ్చారు.

సంజయ్ దత్ :
2008లో హీరో సంజయ్ దత్ హీరోయిన్ మాన్యతాని మూడో వివాహం చేసుకున్నారు. వీరికి 2010లో ఇద్దరు కవలలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి.

ఉదయ భాను :
స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను మొదట ఒకరిని వివాహం చేసుకుంది. అతనితో విడిపోయి విజయ్ కుమార్ అనే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి కవల ఆడ పిల్లలు పుట్టారు

భరత్ :
బాయ్స్ సినిమాతో పరిచయం అయిన భరత్.. ప్రేమిస్తే సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు. 2013లో భరత్ తన చిన్నప్పటి ఫ్రెండ్ జెస్లీ ని పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరికి ఇద్దరు మగ కవల పిల్లలు పుట్టారు.

సన్నీ లియోన్ :
శృంగార తార సన్నీ లియోన్ డానియల్ వెబర్ ని 2011లో వివాహం చేసుకుంది. వీరు నిషా అనే ఓ ఆడపిల్లను 2017లో దత్తత తీసుకున్నారు. అదే ఏడాది సన్నీ లియోన్ ఇద్దరు కవల మగపిల్లలకు జన్మనిచ్చింది.

కరణ్ జోహార్ : నిర్మాత మరియు హోస్ట్ కరణ్ జోహార్ కి 2017లో ఇద్దరు కవలలు పుట్టారు. వీరిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. వీరి పేర్లు రూహి మరియు యష్. ఐతే కరణ్ జోహార్ వైఫ్ ఎవరు అనేది సస్పెన్సు.

ఫరా ఖాన్ :
బాలీవుడ్ లేడీ డైరెక్టర్ మరియు నటి ఫరా ఖాన్ 2004లో కొరియాగ్రాఫర్ శిరీష్ కుందర్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కవల ఆడ పిల్లలు ఉన్నారు

సెలీనా జెట్లీ :
మంచు విష్ణు డెబ్యూ మూవీ సూర్యం సినిమాలో హీరోయిన్ గా నటించిన సెలీనా జెట్లీ 2012లో ఆస్టేలియన్ ఎంట్రప్రెన్యూర్ పీటర్ హాగ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 2017లో ఇద్దరు మగ కవలలు పుట్టారు.

అనసూయ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా ?

జూ ఎన్టీఆర్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

బాలీవుడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడంలో ప్రభాస్ ఉద్దేశ్యం ఏంటి..?

కీరవాణి కొడుకు లైన్ లోకి వచ్చేస్తున్నది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -