Wednesday, April 24, 2024
- Advertisement -

కీరవాణి కొడుకు లైన్ లోకి వచ్చేస్తున్నది..?

- Advertisement -

దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో మెలోడీ పాటలకైనా, మాస్ పాటలకైనా పెట్టింది పేరు.. టాప్ హీరోలకు దేవీశ్రీని కావలి. దేవి శ్రీ లేకపోతే సినిమా ఏమవుద్దో మరీ.. ఇవన్నీ ఒకప్పటి మాటలు… ఇప్పుడు దేవిశ్రీ పాటలు సరిగ్గా చేయడం లేదనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.. థమన్ ఎప్పుడైతే హిట్ అవడం మొదలుపెట్టాడా అప్పటినుంచి టాప్ హీరోలు, దర్శకులు దేవి ని పక్కకు పెట్టారని అంటున్నారు.. అందుకు ఉదాహరణగా తనతో చేయాల్సిన దర్శకుడు థమన్ పంచన చేయడమే..

అయితే దేవిశ్రీ సినిమాలు చేయడం లేదా అంటే చేస్తున్నాడు.. అయితే థమన్ ఇచ్చినంత సంగీతం మాత్రం ఇవ్వడం లేదట.. వీరిద్దరి మధ్య పోటీ ఏమో గానీ ఇద్దరినీ మెచ్చే దర్శకులు ఎవరిని తీసుకోవాలా అని అయోమయంలో పడ్డారట.. ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలన్నీ థమన్ చేతిలో ఉన్నాయి.. దేవిశ్రీ చేతిలో ఒక్క సుకుమార్ తప్పా ఏ సినిమా లేదు.. మొదటి నుంచి సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ లది హిట్ కాంబో.. వీరినుంచి వచ్చే ఐటెం సాంగ్ కి ఫాన్స్ కూడా ఉన్నారు. వీరి మధ్య వచ్చే ఐటెం సాంగ్ ఎంతగా హిట్ అయ్యాయంటే టాలీవుడ్ లో వాటికంటే హిట్ అయిన సాంగ్స్ లేవనే చెప్పాలి..

అయితే దేవిశ్రీ ఫాన్స్ మాత్రం పుష్ప తో మళ్ళీ కం బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు.. ఈ ఇద్దరి మధ్య ఇలా ఆసక్తి కరమైన పోటీ జరుగుతుంటే టాలీవుడ్ కి మూడో ఆప్షన్ ఉండాలని అనేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారికి కీరవాణి కొడుకు కాలభైరవ సమాధానం లా కనిపిస్తున్నారు.. మ‌త్తు వ‌ద‌ల‌రా సినిమాతో త‌ను సంగీత ద‌ర్శ‌కుడి అవ‌తార‌మెత్తి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. నేప‌థ్య సంగీతం కీల‌కంగా మారిన ఆ థ్రిల్ల‌ర్ సినిమాతో కాల‌భైర‌వ‌కు మంచి పేరే వ‌చ్చింది. దీంతో సంగీత ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాలు వ‌రుస‌క‌ట్టాయి. ఈ ఏడాది కాల‌భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా మూడు సినిమాలు అనౌన్స్ కావ‌డం విశేషం. అందులో ఒకటి కలర్ ఫోటో కాగా రెండో ది సత్యదేవ్ నటిస్తున్న శీతాకాలం గుర్తుందా అనే సినిమా.. మరొకటి సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ, శ్ర‌ద్ధ శ్రీనాథ్ క‌ల‌యిక‌లో రాబోతున్న కొత్త చిత్రం. మొత్తానికి వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకెళ్తున్న కాల‌భైర‌వ దేవి, థమన్ లను కొట్టేలానే ఉన్నాడు.

విజయ్ దేవరకొండ కి ఇంత ఫాలోయింగ్ ఏంటి..?

ఎన్టీఆర్ కూడా మొదలుపెట్టడా.. భార్య తో కలిసి..?

సుకుమార్ ని ఇలా రిజెక్ట్ చేస్తున్నారేంటి.. మరో హీరో కూడా..?

రూమర్లకు నితిన్ చెక్.. అదిరిపోయే అప్ డేట్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -