Sunday, May 5, 2024
- Advertisement -

ప్రియా ప్రకాష్ వారియర్ తో నితిన్ రోమాన్స్ !

- Advertisement -

చెక్ మూవీ ట్రైల‌ర్ సినీ ప్రేముకుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ సినిమాతో నితిన్ మారో హిట్ కొట్ట‌నున్నార‌ని ఆయ‌న ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సినిమాకు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ష‌ర వేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానంటూ.. ప్రియురాలితో కలిసి గోవాలో నితిన్ పాట పాడుతున్నాడ‌ట‌. ఇటీవల గోవాలో నితిన్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌పై ఈ పాట‌న్ షూట్ చేశార‌ట‌. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా అంటూ సాగే ఈ పాట‌కు శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. శేఖర్‌ మాస్టర్ దీనికి డ్యాన్స్ మాస్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

ఈ సినిమాకు కల్యాణి మాలిక్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. రకుల్‌ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్రకాష్‌వారియర్ ఈ సినిమాలో హీరోయిన్లు. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ దేశద్రోహిగా ముద్రపడిన ఓ చెస్‌ ప్లేయర్ కథ ఇద‌ని తెలిపారు. యాక్షన్‌, లవ్‌, సస్పెన్స్‌ అంశాలతో థ్రిల్‌ను పంచుతుంద‌ని పేర్కొన్నారు. ఇప్పుడు డీటీఎస్‌ మిక్సింగ్‌ పనుల్ని ష‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంద‌ట‌. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

ప్రభావవంతమైన భారతీయుల్లో టాప్ లేపిన అల్లు అర్జున్

అంచ‌నాలను పెంచుతున్న పుష్ప‌!

పెళ్లి పీట‌లు ఎక్కబోతున్న‌ మ‌హాన‌టి !

వామ్మో విష్ణుప్రియ‌.. చూస్తే త‌ట్టుకోలేరు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -