తమ అభిమాన హీరోని కలవాలి అని ప్రతి ఒక్క అభిమానికి ఉంటుంది. అలాగే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఏ రెంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అభిమానులు చిరు ని ఒక్కసారి కలిస్తే చాలు అనుకుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరు తనని కలిసే అవకాశం ఇస్తున్నాడు. మరి చిరుని కలవాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఏదైన సరై ఒక మంచి పని చేస్తూ దాన్ని వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే చాలు.
ఆ వీడియో చిరుకి నచ్చితే వేంటనే మిమ్మల్ని షూటింగ్ లొకేషన్ కు ఆహ్వానించి చిరు ని కలిసే చాన్స్ ఇస్తాను అంటూ మెగా వారసుడు రామ్ చరణ్ హామీ ఇస్తున్నాడు. చిరుని స్వయంగా చూడాలి, చిరుతో మాట్లాడాలని ఆడపడే అభిమానులు వెంటనే ఏదో ఒక మంచి పని చేస్తూ దాన్ని వీడియో తీసి పంపించండి చిరుని కలవండి.
ఇక చిరు సినిమా విషయానికి వస్తే.. ఎనిమిదేళ్ళ తర్వాత చిరంజీవి పూర్తిస్థాయిలో నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండంటం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. కాకపోతే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరు అనేది క్లారిటీ రాలేదు.
Related