Saturday, May 18, 2024
- Advertisement -

పూరిని మళ్లీ లైన్‍లో పెట్టిన చిరు!

- Advertisement -

అన్ని అనుకున్నట్లు కుదిరితే చిరంజీవి 150 సినిమాని పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చేది. కానీ పూరి చెప్పిన కథలో సెకండ్ ఆఫ్ బాగలేదు అని పూరితో సినిమా చెయలేదు. ఆ తర్వాత చిరు తన 150 సినిమాని వినాయక్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. అయితే చిరుతో సినిమా చేద్దాం అనుకున్న పూరికి ఆ చాన్స్ మిస్ అవ్వడంతో బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కాడు.

దీంతో రామ్‌చరణ్ డైరెక్ట్‌గా రంగంలోకి దిగి పూరీని కూల్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.. అయితే కత్తి చిత్రం తర్వాత చిరు వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కి ఓ మంచి కథను రెడీ చెయ్యమని గ్రీస్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే తివిక్రమ్‌ శ్రీనివాస్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ‌్యంలో పూరీ మళ్లీ తన ఆటో జానీ సినిమాను పట్టాలెక్కించడానికి ట్రై చేస్తున్నట్టు సమాచారం. సెకండాఫ్‌ ఈ మధ్యే పూర్తి చేసిన పూరీ.. చిరంజీవికి చెప్పి ఒప్పించాడని టాక్ వినిపిస్తోంది. సో… కత్తి రీమేక్‌ తర్వాత చిరు చేయబోయే సినిమా ఆటోజానీ అయినా ఆశ్చర్యం లేదేమో..మరి పూరీ స్పీడ్ అలాంటిది…

Related

  1. సునీల్ నో అన్నాడు కానీ చిరు మాత్రం ఓకే అన్నాడు!
  2. చిరు మొదలు పెట్టేసాడు!
  3. చిరు పై బాహుబలి భారం
  4. చిరు సందీప్ ని ఎందుకు తిట్టాడు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -