Wednesday, May 22, 2024
- Advertisement -

మెగాస్టార్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్!

- Advertisement -
chiranjeevi 151 movie going to directed by surender reddy

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ఖైదీ నంబర్ 150. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తోంది. చిరు సరసన కాజల్ నటించిన ఈ చిత్రంను రామ్ చరణ్ నిర్మించారు. ఇక ఈ సినిమా వందకోట్ల క్లబులో మెగా ఫ్యాన్స్ కి ఆనందాన్ని పంచింది.

ఈ క్రమంలో మెగాస్టార్ తన తర్వాతి సినిమాలను ఖరారు చేశారు. 151వ సినిమాని సురేందర్ రెడ్డి డైరక్ట్ చేయనున్నారు. రామ్ చరణ్‍కి ధృవ హిట్ ఇచ్చిన సూరి టేకింగ్ బాగుండడంతో మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక చిరు 152 సినిమకి కూడా దర్శకుడు ఒకే అయిపోయారు.

మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బోయపాటి శ్రీను మెగాస్టార్ కి యాక్షన్ కథను సిద్ధం చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. అంతేకాదు ఈ సంవత్సరంలోనే విడుదల చేయాలని చిరు అనుకుంటున్నారు. కాబట్టి మెగా ఫ్యాన్స్‌కు ఈ ఏడాది సినిమాల రూపంలో మరో రెండు పండుగలు రానున్నాయి.

Related

  1. చిరు దెబ్బకి బయపడిన వర్మ.. అందుకే ఈ ట్వీట్స్..?
  2. చిరుని నానా హింసలు పెట్టిన రామ్ చరణ్!
  3. నాగబాబు, పవన్ ల గురించి నిజాలు చెప్పిన చిరు!
  4. మహేష్, ఎన్టీఆర్, అఖిల్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన చిరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -