Sunday, June 16, 2024
- Advertisement -

విశ్వంభరలో కన్నడ బ్యూటీ!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులో కన్నడ భామ చేరింది. అమిగోస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది ఆషికా. తర్వాత నాగార్జున.. ‘నా సామి రంగ’ మూవీలో నటించి మెప్పించింది.

తాజాగా చిరు సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ మేరకు ఆషికా రంగనాథ్ ఈ మూవీలో జాయిన్ అయిందంటూ విశ్వంభర మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఆమె చాలా క్యూట్ అండ్ స్వీట్‌గా కనిపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -