Thursday, May 2, 2024
- Advertisement -

వామ్మో.. చిరు క్రేజీ మాములుగా లేదుగా..!

- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి నుంచి సినిమా వస్తుందంటే మాములుగా ఉండదు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ మొదలు.. ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌, ఆడియో విడుదల ఇలా ప్రతీది మెగా ఫ్యాన్స్‌కి ప్రత్యేకమే. ఒక్క‌సారి ఆయ‌న అడుగుపెడితే చాలు రికార్డుల బద్దలు అవ్వాల్సిందే. ఇప్పుడు కూడా అదే జరిగింది. తాజాగా చిరు నటించిన ‘ఆచార్య’సినిమా టీజర్‌ శుక్రవారం(జనవరి 29) రిలీజ్‌ అయింది. విడుదల కావడంతోనే భారీ రెస్పాన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రికార్డు స్థాయి వ్యూస్ మరియు రికార్డు స్థాయి లైక్స్ తో యూట్యూబ్ లో సెన్సేషన్ ను నమోదు చేసింది. యూట్యూబ్ నెంబర్ వన్‌ ట్రెండింగ్ లోకి ఆచార్య వచ్చేశాడు.

కేవలం గంటల్లో 65 లక్షల వ్యూస్ అందుకుంది. 4 లక్షల 90వేలకు పైగా లైక్స్ తో ఈ టీజర్‌ దూసుకెళ్తొంది. గంటల్లోనే లక్షల్లో వ్యూస్‌ వస్తే.. రోజుల్లో మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని మెగా ఫ్యాన్స్‌ ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
అలాగే దీనితో పాటుగానే నిన్ననే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ లో మరో సరికొత్త ఊపు వచ్చింది. ‘ప్రపంచ వ్యాప్తంగా మే 13 నుంచి ఆచార్య థియేటర్లలో విడుదల కానుంది’అని ట్విటర్‌ వేదికగా రామ్‌చరణ్‌ ప్రకటించాడు.

ఇక టీజర్‌ విషయానికి వస్తే..‘ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు’అంటూ మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ మొదలవుతుంది. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనిపించింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న’కార్తీకదీపం’ సౌందర్య!

భార్యకు కూడా తెలియకుండా ఆ పని చేసిన విజయ్ సేతుపతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -