Monday, April 29, 2024
- Advertisement -

విజయనగరంలో టీడీపీకి భారీ షాక్!

- Advertisement -

పంచాయతీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. విజయనగరం జిల్లా టీడీపీలో కీలక మహిళానేతగా పేరొందిన ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పడాల అరుణ టీడీపీకి శనివారం గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పడాల అరుణ ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు.

పార్టీలో కష్టపడి పనిచేస్తే సరైన గుర్తింపు దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు లేని చోట ఎలా ఉండాలని పేర్కొన్నారు. 33 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా పావుగా వాడుకున్నారే తప్ప కనీస ప్రాధాన్యం ఇవ్వలేదని తెలిపారు. పార్టీలో ఇమడలేకే రాజీనామా చేసి వైదొలుగుతున్నట్లు ఆమె చెప్పారు. అటు అధిష్టానం, ఇటు జిల్లా పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం, ముఖ్యమైన కమిటీలలో చోటు కల్పించకపోవడం వంటి కారణాలు తీవ్ర అసంతృప్తి కి గురి చేసినట్టు పడాల అరుణ వెల్లడించారు.

నిజాయితీని నిరూపించుకోండి!

అమ్మ పాత్రల్లో నటించే వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

చరణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -