Wednesday, May 15, 2024
- Advertisement -

ఒక ఎపిసోడ్ కి చిరు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

- Advertisement -
chiranjeevi gets shocking remuneration for mek show

తెలుగు సినీ పరిశ్రమలో ఒక సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి నటుడు మెగాస్టార్ చిరంజీవి. చిరు సినిమాలు హిట్ అయితే ఏ రెంజ్ లో కలెక్షన్స్ వస్తాయో ప్రత్యేకించి చెప్పకర్లేదు. అందుకే నిర్మాతలు కూడా ఎంత ఇవ్వడానికైన రెడీ అవుతున్నారు.

తొమ్మిదేళ్ల తర్వాత చిరు రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నంబర్ 150. ఇప్పటికే ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ వసూలు చేసి మెగాస్టార్ స్టార్ సత్తా చూపింది. ఇప్పుడు బుల్లితెర లో రికార్డులను నెలకొల్పడానికి రెడీ అవుతున్నారు చిరంజీవి. ఆయన హోస్టుగా చేసిన తొలి షో “మీలో ఎవరు కోటీశ్వరుడు(సీజన్ 4 )” కోసం తెలుగురాష్ట్రాలలోని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 13 నుంచి మాటీవీ లో ప్రసారం కానున్న ఈ షోలో తొలి గెస్ట్ గా గత హోస్ట్ అక్కినేని నాగార్జున రానున్నారు.

ఇక ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజున చిరు తన కుటుంబ సభ్యులతో షో ని సరదాగా నడిపించనున్నారు. ఆ తర్వాత పార్టిసిపేట్స్ తో కోటీ రూపాయల గేమ్ ఆడనున్నారు. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ షోలో ఒక ఎపిసోడ్ కి బాస్ పది లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. గంట ప్రసారమయ్యే ఒక ఎపిసోడ్ కి పది లక్షలు తీసుకోవడం తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇదే తొలిసారి. షో టెలికాస్ట్ కి ముందే రెమ్యునరేషన్ విషయంలో రికార్డు సృష్టించిన చిరు.. షో ప్రసారం అయ్యక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతాడో చూడాలి.

Related

  1. చిరు దెబ్బకి బయపడిన వర్మ.. అందుకే ఈ ట్వీట్స్..?
  2. చిరుని నానా హింసలు పెట్టిన రామ్ చరణ్!
  3. నాగబాబు, పవన్ ల గురించి నిజాలు చెప్పిన చిరు!
  4. మహేష్, ఎన్టీఆర్, అఖిల్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన చిరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -