Saturday, April 20, 2024
- Advertisement -

పావల శ్యామలను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో హాస్యభరిత పాత్రలు పోషించిన నటి పావల శ్యామల ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. వృద్దాప్యంలో ఆమె పరిస్థితి దయనీకంగా మారింది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నటి కరెటా కళ్యాణి ఆమెకు ఆర్థిక సహాయం అందించి.. తన పరిస్థితి గురించి అందరికీ చూపించింది. కాగా, పావలా శ్యామల తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి చలించిపోయారు.

గత ఏడాది నుంచి కరోనా కష్టకాలంలో ఎంతో మంది సినీ కార్మికులను ఆదుకున్నారు. తాజాగా నటి పావలా శ్యామల కి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం ఇప్పించే నిమిత్తం రూ.1,01,500 మొత్తానికి చెక్కును తన ప్రతినిధుల ద్వారా పంపించారు. ‘మా’లో సభ్యత్వం వల్ల ఇక ఆమెకు ప్రతి నెలా అసోసియేషన్ నుంచి రూ.6000 పెన్షన్ లభిస్తుంది.

చిరంజీవి చేసిన కృషికి తాను ఎంతో రుణపడి ఉన్నానని.. గతంలో కూడా ఆయన తనకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారని తనకు ఇంతటి సహాయం చేసిన చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు. దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించిన శ్యామల ప్రస్తుతం ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు. శ్యామలకు సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు రూ.50 వేలు అందించారు.

భట్టి కి షాక్ ఇచ్చిన పువ్వాడ..!

నేటి పంచాంగం,బుధవారం (19-05-2021)

తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -