Friday, April 19, 2024
- Advertisement -

తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు..!

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ (పీఎం జన్ ఆరోగ్య యోజన) లో చేరేందుకు తొలుత విముఖత చూపిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనసు మార్చుకుంది. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ ఆరోగ్యశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందుకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది.

ఆయుష్మాన్ భారత్ నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా కరోనా చికిత్సకు లబ్దిదారుడు రూ.5 లక్షల వరకు ప్రయోజనం పొందే వీలుంది. అయితే, ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల మందికి మాత్రమే ప్రయోజనం ఉంటుందని, అదే ఆరోగ్యశ్రీ అయితే 84 లక్షల మంది ప్రయోజనం ఉండబోతున్నట్లు తెలిపారు.

కేంద్ర పథకం ద్వారా వచ్చే నిధులు తక్కువేనని వెల్లడించింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల వైద్య పథకాల కోసం ఏడాదికి రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించింది. ఈ క్రమంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏ రిజ్వీ… రాష్ట్ర ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓకు పథకం అమలుపై ఉత్తర్వులు జారీ చేశారు.

నేటి పంచాంగం,బుధవారం (19-05-2021)

తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపు

స్నేహితుడి కోసం పెద్ద మనసు చేసుకున్న సోనూసూద్.. నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -