Friday, April 26, 2024
- Advertisement -

బీస్ట్ డైరెక్టర్‌పై విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌పై కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్సన్, విజయ్ కాంబినేషన్ ఇటీవల విడుదలైన బీస్ట్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నా.. అంచనాలను అందుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి, దర్శకుడు చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఓ తమిళ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెల్సన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ స్టార్‌డమ్ కారణంగానే ఈ సినిమా ఆడుతోందన్నారు. అద్భుతాలు సృష్టించాల్సిన సినిమాలో అలాంటిదేమీ కనిపించలేదన్నారు.

నెల్సన్ ఇంకాస్త కసరత్తు చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. బీస్ట్ విజయంలో ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్ట్, ఎడిటర్, హీరో ఇలా అందరి పాత్ర ఉందన్న చంద్రశేఖర్.. డైరెక్టర్ నెల్సన్‌కు మాత్రం ఆ క్రెడిట్ ఇవ్వలేదు.

ఆ ఛాన్స్ కోసం కేజీఎఫ్‌ బ్యూటీ నిరీక్షణ

కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కేజీఎఫ్-2

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -