ఆ ఛాన్స్ కోసం కేజీఎఫ్‌ బ్యూటీ నిరీక్షణ

- Advertisement -

టాలీవుడ్‌పై మరో కన్నడ కస్తూరి కన్నేసింది. ఇప్పటికే కర్ణాటక భామలతో తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడుతోంది. రష్మికా మందణ్ణ, పూజా హెగ్డే, నభ నటేశ్ లాంటి కన్నడ భామలు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒకప్పటి టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి సైతం టాలీవుడ్‌ను ఇంకా వీడలేదు. తాజాగా వీరి జాబితాలో మరో కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి వచ్చి చేరింది.

కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి. శాండిల్‌వుడ్‌లో కేజీఎఫ్‌ -1లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఆ సినిమాలో తన వైవిధ్య నటన చూపేందుకు అంతగా ఆస్కారం ఇవ్వలేదు దర్శకుడు నీల్. అయితే కేజీఎఫ్‌-2 లో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆమె స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ఈ మూవీ బ్లాక్‌ బాస్టర్ కావడంతో దక్షిణాది నుంచి ఈ భామకు వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

- Advertisement -

శ్రీనిధి మాత్రం ప్రధానంగా టాలీవుడ్‌పైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో మీడియం రేంజ్ హీరోలతో అవకాశాలు వస్తున్నాయి. అయితే తాను మాత్రం పెద్ద హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఈ అమ్మడు భావిస్తోందట. మరి ఈ కన్నడ భామ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి.

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ కు ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

అయేషా టాకియాకు చేదు అనుభవం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -