Friday, May 17, 2024
- Advertisement -

మెగా అభిమానులకు దీపావళి కానుక!

- Advertisement -
chiru 150th movie first look

మెగాస్టార్‌ చిరంజీవి చాలాకాలం తర్వాత వెండి తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాడు. చాలాకాలం తర్వాత తన 150వ చిత్రంలో నటిస్తున్నాడు. దాదాను తొమ్మిది ఏళ్ల విరామం తీసుకున్న చిరు మళ్లీ వెండి తెరపైకి రాబోతున్నాడు అనగానే అభిమానులకు ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాని చిరు తన 150వ సినిమాగా తీస్తున్నాడు.

ఈ 150వ చిత్రాన్ని ‘ఖైది ఎం.150’ని మాస్‌ దర్శకుడు వివి వినాయక్‌ తెరకెక్కిస్తుండగా రామ్‌ చరణ్‌ మరియు లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్‌ హీరోయిన్‌గా రొమాన్స్‌ చేస్తోంది. రాయ్‌ లక్ష్మి ప్రత్యేక పాటలో చిరుతో చిందులేస్తోంది. ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా చిత్ర యూనిట్‌ వారు దీపావళి కానుక ఇచ్చేశారు.

దీపావళి సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ‘ఖైదినె. 150’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. గతంలో విడుదలైన చిరు లుక్‌కు మంచి స్పందననే వచ్చింది. ఈ ఫస్ట్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ లుక్‌ చూస్తే చిరు ఈ సినిమాతో రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం భారీ రెటుకు అమ్ముడు పోయింది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

{youtube}vkfL8b9-iUw{/youtube}

Related

  1. చిరు పెద్ద కూతురు భలే తయారు చేసింది
  2. చిరు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుస్తే దిమ్మతిరగాల్సిందే!
  3. పవర్ స్టార్ ‘బ్రాస్ లెట్’ ధరించిన శ్రీముఖి!
  4. మేము సైతంలో రికార్డు సృష్టించిన మెగా హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -