- Advertisement -

చిరు పెద్ద కూతురు భలే తయారు చేసింది

- Advertisement -

రూమర్ల ప్రకారం చూసుకుంటే.. అసలు మెగా డాటర్ చెప్పిన స్టయిల్ ఐడియాస్.. అండ్ ఆమె డిజైన్ చేసిన ఔట్ ఫిట్స్ వేసుకోలేదనే హీరోయిన్ క్యాథరీన్ త్రెసాను మెగాస్టార్ రీ-ఎంట్రీ సినిమా అయిన ”ఖైదీ నెం 150” నుండి తప్పించేశారని టాక్. ఇప్పుడు ఆ ప్లేసులోకి వెంటనే దిగిపోయింది హీరోయిన్ లక్ష్మీ రాయ్. అమ్మడు ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ చేసింది తెలుసా.

షూటింగ్ స్పాటులో పాటకు కావల్సినట్లుగా ఫుల్లుగా రెడీ అయిపోయిన లక్ష్మీ రాయ్.. ఖైదీ నెం 150 షూటింగులో బాగా ఎంజాయ్ చేస్తున్నాను.. సుస్మిత చేసిన స్టయిలింగ్ సూపర్బ్ అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకుంది. గతంలో అమ్మడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం షూట్ చేసినప్పుడు కూడా ఇదే విధంగా ఫోజులు ఇచ్చిందిలే.

ఆమె లుక్ ఎంత హాటుగా ఉంటుందో నెట్లో కూడా పెట్టేసింది. అయితే ఇప్పుడు అందరూ ఆలోచిస్తోంది ఒక్క విషయం గురించే.. ఏదైతే స్టయిలింగ్ క్యాథరీన్ వద్దందో ఇప్పుడు అదే లక్ష్మీ రాయ్ కు ఎక్కించేసిందే సుస్మిత అంటున్నారు. మొత్తానికి అప్పుడెప్పుడో జై చిరంజీవ సినిమాకు డాడ్ ను స్టయిలింగ్ చేసిన సుస్మిత.. ఇప్పుడు రెండో ఎంట్రీ ఇస్తూ ఇటు ఖైదీ నెం 150కే కాకుండా మీలో ఎవరు కోటీశ్వరుగు ప్రోగ్రామ్ కు కూడా స్టయిలింగ్ చేస్తోందట. చూస్తుంటే త్వరలో మెగా ఫ్యామిలీ మొత్తం ఈమె స్టయిల్స్ లోనే మెరుస్తారేమో అన్నట్లుంది యవ్వారం. 

Related

  1. ఒక్కడు సరిపోడు.. ఇద్దరు కావాలి అంటున్న లక్ష్మి!
  2. మంచు లక్ష్మి గురించి ఎవరికి తెలియాని నిజాలు!
  3. ఐ లవ్ యూ ఎలా చెప్పలో అల్లూ శిరీష్ కి నేర్పించిన మంచు లక్ష్మి
  4. మెగా హీరో కి సటైర్ వేసిన మంచు లక్ష్మి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -