Friday, May 17, 2024
- Advertisement -

మేము సైతంలో రికార్డు సృష్టించిన మెగా హీరో

- Advertisement -
Sai Dharam Tej sets New Record with Memu Saitham

ఈ మధ్య అంటే రికార్డులు నమోదవడం.. అవి మళ్లీ మూడు నెలలకే ఇంకొకళ్లు వచ్చి తిరగరాయడం జరిగిపోతోంది కానీ.. మెగా హీరోలు సృష్టించిన రికార్డులను టచ్ చేయడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందనే సంగతి తెలిసిందే. కలకాలం ఉండిపోకపోయినా.. పదిలంగా పది సీజన్ల పాటు నిలిచిపోగల రికార్డులను మోగించగల సత్తా మెగా హీరోలది.

గత కొన్ని నెలలుగా మేము సైతం అంటూ మంచు లక్ష్మి ఓ ఛారిటీ బేస్డ్ షో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను అవసరంలో ఉన్న కష్టాల్లో ఉన్నవారిని ముందుగానే ఎంపిక చేసి మరీ ఇస్తుంటారు. చాలామంది సినిమావాళ్లే ఈ మేముసైతంలో పాల్గొని.. డొనేషన్స్ వసూలు చేయగా.. ఇప్పుడు మెగా హీరో సాయిధరం తేజ్ ఈ కార్యక్రంలో భాగమయ్యాడు. రోడ్డుపై నుంచి స్వీట్లు అమ్మే కుర్రాడి అవతారం ఎత్తి.. బోలెడన్ని డబ్బులు పట్టుకొచ్చేశాడు తేజు. తూర్పు గోదావరి జిల్లా పులిమెర్రులోని అంగవికలురలైన పిల్లల కోసం నడుపుతున్న స్కూల్ కి విరాళం ఇచ్చేందుకు తేజు ఫండ్స్ కలెక్ట్ చేయగా.. ఏకంగా 20 లక్షలు ఒక్క పూటలో తీసుకు రాగలిగాడు తేజు.

ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎపిసోడ్స్ కీ ఇదే అతి పెద్ద రికార్డ్ కావడం విశేషం. ఛారిటీ కోసం మేముసైతం నిర్వహిస్తుండగా.. మెగాహీరోలెవరూ రావడం లేదనే విమర్శ ఈ మధ్య వచ్చింది. తాము ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో తేజు రంగప్రవేశం తర్వాత స్పష్టంగా కనిపించింది కాబట్టి.. ఇక మిగిలిన హీరోలు కూడా వచ్చేస్తే.. థియేటర్లలోనే కాదు ఛారిటీలోనూ కలెక్షన్స్ అదిరిపోతాయంతే.

{youtube}zeu6LSG3WSs{/youtube}

Related

  1. నైట్ ఆ హీరోయిన్‌తో అడ్డంగా దొరికిపోయిన సాయిధ‌ర‌మ్‌
  2. సాయి పల్లవి ప్రేమలో పడ్డా హీరో!
  3. సాయిధ‌ర‌మ్ కోరికకు షాక్ అయిన సమంత!
  4. చిరంజీవి కోసం సాయి ధరం తేజ త్యాగం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -