Monday, May 6, 2024
- Advertisement -

ధర్మయోగి మూవీ రివ్యూ!

- Advertisement -
dharma yogi movie review

తెలుగులో కూడా ధనుష్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్.. తన సినిమాలను తెలుగులో కూడా డబ్బు చేస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘కోడి’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘ధర్మ యోగి’ అన్న పేరుతో డబ్ చేశారు.

తమిళంలోనిన్ననే రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో ఒకరోజు ఆలస్యంగా నేడు రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కథ :

ధర్మ (ధనుష్), యోగి (ధనుష్) కవలపిల్లలు. చిన్నప్పట్నుంచే తండ్రితో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండే యోగి, పెద్దయ్యాక అదే రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటాడు. ఇక ధర్మ బాగా చదువుకొని కాలేజీ ప్రొఫెసర్ అవుతాడు. బాపట్ల నియోజకవర్గంతో పాటు గుంటూరు జిల్లా మొత్తానికీ యోగీ పార్టీ యూత్ లీడర్‌గా కొనసాగుతూంటాడు. అతడి ప్రేయసి రుద్ర (త్రిష) మాత్రం వేరొక పార్టీలో యోగి స్థాయి పదవిలోనే కొనసాగుతూంటూంది. ఒక మధ్యంతర ఎన్నికల్లో యోగి, రుద్రలకు పోటీ జరుగుతుంది. ఆ ఎన్నికల సమయంలోనే యోగి హత్య కాబడతాడు. యోగిని ఎవరు హత్య చేశారు? యోగి చనిపోవడంతో అదే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎంపికైన ధర్మ, ఆ హత్య కేసును ఎలా చేధిస్తాడు? ఈ కథలో మాలతి (అనుపమ పరమేశ్వరన్) ఎవరూ? లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రం మేజర్ ప్లస్ అంటే ఈ సినిమా కథే అని చెప్పాలి. నడిపించిన కథ.. స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లు ఈ సినిమాకి ప్రధాన బలం. త్రిష పాత్రలో ట్విస్ట్ చాలా బాగుంది. త్రిష నటన ఊహించని విధంగా ఉంది. ధనుష్ ఎప్పట్లాగే తన ఎనర్జీతో అలవోకగా నటించేశాడు. రెండు పాత్రల్లో అతడు చూపిన వైవిధ్యం కూడా బాగా ఆకట్టుకుంది. ధనుష్, త్రిషల మధ్యన రొమాంటిక్ ట్రాక్ చాలా కొత్తగా ఉంది. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా తలపడుతూనే, ఒకరినొకరు ఇష్టంగా కూడా ప్రేమించుకుంటూ ఉండే వీరిద్దరి మధ్యన వచ్చే చాలా సన్నివేశాలు కట్టిపడేసేలా ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ తన పరిధిమేర బాగా నటించింది. ఇంటర్వెల్, సెకండాఫ్‌లో వచ్చే మూడు, నాలుగు ట్విస్ట్‌లు బాగా ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

కొన్నిచోట్ల కథ నెమ్మదిగా నడవడమే మైనస్‌గా చెప్పుకోవాలి. అనవసరమైన డీటైలింగ్‌ ఇచ్చి కొన్నిచోట్ల సినిమాను సాగదీసినట్లు కూడా అనిపించింది. పూర్తిగా సీరియస్ పంథాలోనే సాగే ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నా, పక్కా తెలుగు సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేవు. ఇవే అంశాలను కోరుకొని వచ్చేవారికి ఇది నిరాశపరచే అంశమే. తెలుగు డబ్బింగ్ సాదాసీదాగా ఉంది.

మొత్తంగా: 

పొలిటికల్ థ్రిల్లర్స్‌లో స్టోరీ, స్క్రీన్ ప్లే ఉండటం చాలా అవసరం.. అందుకు తగ్గట్లుగానే అదే స్థాయి లో పాత్రలు ఉడటం కూడా అంతే అవసరం. ధర్మ యోగి.. బలమైన స్టోరీ.. స్క్రీన్ ప్లే, బలమైన పాత్రలతో అలా ఆకట్టుకునే ఓ సినిమా. ధనుష్, త్రిషల అద్భుతమైన నటన, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో వచ్చిన ఈ సినిమాలో అక్కడక్కడా కాస్త రిపీటెడ్ సన్నివేశాలు రావడమే మైనస్‌గా చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఎక్కడా తగ్గదు.

రివ్యూ రేటింగ్:3.0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -